ఫోర్బ్స్‌ ధనవంతుల జాబితాలో ఇండో-అమెరికన్‌ మహిళలు!

7 Jul, 2022 10:57 IST|Sakshi

ఫోర్బ్స్‌ అమెరికా రిచెస్ట్‌ సెల్ఫ్‌ మేడ్‌ ఉమెన్స్‌ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ఇండో- అమెరికన్‌ మహిళలు చోటు దక్కించుకున్నారు. భారతీయ మూలాలున్న మహిళలు ఆయా రంగాల్లో రాణించడమే కాదు.. దిగ్గజ సంస్థల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 

ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం..  
ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో నిలిచిన వారిలో జయశ్రీ ఉల్లాల్,నీర్జా సేథి,నేహా నార్ఖడే,ఇంద్ర నూయి,రేష్మా శెట్టిలు ఉన్నారు. జయశ్రీ ఉల్లాల్‌ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో 15వ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అరిస్టా నెట్‌వర్క్స్ కోఫౌండర్‌గా నీర్జా సేథి 24 ర్యాంకు దక్కించుకున్నారు. ఇక మాజీ పెప్సికో సీఈవోగా ఇంద్రా నూయి ఫోర్బ్స్‌ జాబితాలో 85వ స్థానం దక్కింది. జింగో బయోవర్క్స్ కో-ఫౌండర్‌గా ఉన్న రేష్మా శెట్టి ఫోర్బ్స్‌ విడుదల చేసిన అమెరికా రిచెస్ట్‌ సెల్ఫ్‌ మేడ్‌ ఉమెన్‌ జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. 

వారి ఆస్తులు ఎంతంటే
జయశ్రీ ఉల్లాల్‌ పోర్బ్స్‌ విడుదల చేసిన అమెరికాలో సెల్ఫ్‌ మేడ్‌ బిలియనిర్ల జాబితాలో 15వ స్థానం దక్కించుకున్న ఆమె..1.9 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచారు. 2018 నుంచి  అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవోగా పనిచేస్తున్న జయశ్రీ ఆ సంస్థలో 5శాతం వాటా ఉన్నారు. 

ఫోర్బ్స్‌ విడుదల చేసిన మహిళా ధనవంతుల జాబితాలో 24వ స్థానాన్ని కైవసం చేసుకున్న నీర్జా సేథి టోటల్‌ నెట్‌ వర్త్‌ 1 బిలియన్‌ డాలర్లగా ఉంది.1980లలో అమెరికా మిచిగాన్ నగరం ట్రాయ్‌లో సొంత అపార్ట్‌ మెంట్‌లో భర్త భరత్‌ దేశాయ్‌తో కలిసి ప్రారంభ పెట్టుబడి 2వేల డాలర్లతో ఐటీ కన‍్సల్టింగ్‌, ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ  సింటెల్‌ను ప్రారంభించారని ఫోర్బ్స్‌ తన నివేదికలో పేర్కొంది. 

సంస్థ కో-ఫౌండర్‌గా, మాజీ సీటీవోగా పనిచేస్తున్న నేహా నార్ఖడే 490 బిలియన్‌ డాలర్లతో ఫోర్బ్స్‌ జాబితాలో 57వ స్థానాన్ని దక్కించుకున్నారు. పూణేకి చెందిన నేహా జార్జీయా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివారు. ఆమె విద్యాభ్యాసం తర్వాత లింక్డిన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేశారు. 
 
మాజీ పెప్సికో సీఈవోగా ఉన్న ఇంద్రా నూయి 320 మిలియన్ల డాలర్లతో  ఫోర్బ్స్‌ బిలియనిర్ల జాబితాలో  85వ స్థానం దక్కించుకున్నారు.

చివరిగా 220 మిలియన్ డాలర్లతో జింగో బయోవర్క్స్ కో-ఫౌండర్‌గా ఉన్న రేష్మా శెట్టి.. ఫోర్బ్స్‌ విడుదల చేసిన అమెరికా రిచెస్ట్‌ సెల్ఫ్‌ మేడ్‌ ఉమెన్‌ జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. 2009లో రేష్మా శెట్టి భర్త బ్యారీ కాంన్‌టాన్‌తో పాటు మరో నలుగురు భాగస్వాములతో కలిసి సింతటిక్‌ బయో టెక్నాలజీ కంపెనీ జింగో బయోవర్క్స్‌ను నెలకొల్పారు.

మరిన్ని వార్తలు