JBL CSUM10 Microphone: మీరు కంటెంట్‌ క్రియేటర్లా..? ఐతే ఇది మీకోసమే..!

30 Jun, 2021 12:24 IST|Sakshi

ప్రముఖ అకౌస్టిక్‌ కంపెనీ జేబీఎల్‌ నుంచి మరో ప్రొడక్ట్‌ మార్కెట్‌లోకి వచ్చింది. నాణ్య తతో కూడిన రికార్డింగ్‌ చేసేలా ఇందులో టెక్నాలజీ మిక్స్‌ చేసింది.  గతంలోనూ జేబీఎల్‌ నుంచి ఈ తరహా ఉత్పత్తులు వచ్చినా... ఈసారి బడ్జెట్‌లో ఈ మైక్రోఫోన్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. చేతిలో ఎక్కడికైనా పట్టుకుపోయేలా డిజైన్‌ చేసింది. సోషల్‌​ మీడియా వేదికగా పని చేసే కంటెంట్‌ క్రియేటర్లకు అనువుగా రూపుదిద్దింది. ఆ గాడ్జెట్‌ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. 

అద్భుతమైన ఫీచర్లు
జేబీఎల్‌ CSUM10 మీ దగ్గరుంటే రికార్డింగ్‌ స్టూడియో ఉన్నట్టే. ప్లగ్‌ అండ్‌ ప్లేగా డిజైన్‌ చేయడంతో దీన్ని ఉపయోగించడం తేలిక. ఇక డిజైన్‌ కూడా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా అవుట్‌డోర్‌ రికార్డింగులు తేలిగ్గా చేయోచ్చు.  మైక్రోఫోన్‌ను సులువుగా వాడుకోవడానికి వీలుగా  రౌండ్‌ మెటల్‌ డెస్క్‌ టాప్‌ స్టాండ్‌తో వస్తోంది. బాడీ మొత్తం ఫుల్‌ మెటల్‌ ఫినీషింగ్‌తో వస్తోంది.  కంట్రోల్స్‌ విషయానికొస్తే.. బిగినింగ్‌ స్టేజ్‌లో ఉన్న కంటెంట్‌ క్రియేటర్లకు సులువుగా  దీన్ని వాడవచ్చు. మైక్రోఫోన్‌ ముందు భాగంలో రెండు బటన్స్‌ను ఉన్నాయి. వీటిలో ఒకటి వాల్యూమ్ కంట్రోల్‌ చేయోచ్చు. మరొకటి వాయిస్‌ను అడ్జస్ట్‌  చేయడానికి ఉపయోగపడుతుంది. లైవ్‌ ప్రోగ్రామ్స్‌కి  తగ్గట్టుగా మ్యూట్‌ బటన్‌ కూడా ఇందులో ఉంది.  డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లతో కనెక్ట్ చేయడానికి యుఎస్‌బి-సి పోర్ట్  సౌకర్యం ఉంది.  టైప్‌ సీ ఇయర్‌ ఫోన్‌ కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా 3.5 ఎంఎం ఇయర్‌ ఫోన్‌ జాక్‌కే చోటు కల్పించారు. 

తిరుగులేని పర్ఫార్మెన్స్‌
ఈ మైక్రో ఫోన్‌లో రెండు రకాల మోడ్‌లను ఏర్పాటు చేసింది జేబీఎల్‌.
1. ఒమ్నీ డైరక్షనల్‌ మోడ్‌(అన్ని దిశల నుంచి సమానంగా సౌండ్‌ రికార్డు అవుతుంది. )
2.కార్డియాడ్‌ మోడ్‌ (మీకు 180 డిగ్రీల సమాంతరంగా రికార్డింగ్‌ చేస్తోంది  )


ధర
JBL CSUM10 డ్యూయల్ క్యాప్సూల్ కండెన్సర్ యూఎస్‌బీ రకం మైక్రోఫోన్ ధర రూ 5,799 గా ఉంది. JBL CSUM 10 బడ్జెట్‌ ఫ్రెండ్లీ మైక్రోఫోన్‌. అతి తక్కువ ధరలో మల్టీ రికార్డింగ్‌ మైక్రోఫోన్‌ రావడం చాలా అరుదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ స్వరాన్ని రికార్డు చేయవచ్చును. మీకు ఈ మైక్రోఫోన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చును. ఇంకేందుకు ఆలస్యం వెంటనే కొనేయ్యండి.

చదవండి: అదిరిపోయిన వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ మొబైల్

మరిన్ని వార్తలు