అదిరింది కియా.. మన్నికలో మేటి..

28 Feb, 2022 11:04 IST|Sakshi

ఇండియన్‌ మార్కెట్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది కియా. కియా నుంచి వచ్చే కార్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. అయితే అమ్మకాల్లోనే కాదు మన్నికలోనూ తగ్గేదేలే అంటోంది. తాజాగా జేడీ పవర్‌ స్టడీలో అంతర్జాతీయ స్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది.

ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి సంబంధించి రెగ్యులర్‌గా అనేక సర్వేలు జరుగుతుంటాయి. వీటిలో చాలా సర్వేలు టెక్నికల్‌ అంశాలతో ముడిపడి ఉంటాయి. వీటికి కొంత భిన్నంగా మూడేళ్లకు పైగా వాహనాలు వాడిన యజమానుల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించడం జేడీ పవర్‌ సర్వే ప్రత్యేకత. 

రిపేర్లు, కాంపోనెంట్స్‌ రిప్లేస్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌, వెహికల్‌ అప్పీల్‌ తదితర అంశాలపై యజమానుల నుంచి వివరాలు సేకరిస్తుంది. తాజాగా చేపట్టిన సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా మెయిన్‌స్ట్రీమ్‌, లగ్జరీ విభాగంలో 31 కంపెనీల కార్లకు పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టారు.

ఈ సర్వేలో కియాకు చెందిన అప్పర్‌ మిడ్‌రేంజ్‌ ఎస్‌యూవీ సొరెంటో నంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ కారుని జార్జియాలోని కియా ప్లాంటులో తయారు చేస్తున్నారు. జేడీ పవర్‌ సర్వేలో నంబర్‌ వన్‌ స్థానం దక్కించుకున్న కియా సొరెంటే ప్రస్తుతానికి ఇండియన్‌ మార్కెట్‌లో అందుబాటులో లేదు. త్వరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతున్న ఈ కారు ధర రూ. 25 లక్షల దగ్గర ఉండవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా.

చదవండి: Kia India-AP: కియా అనంత ప్లాంట్‌ కొత్త రికార్డ్‌ 

మరిన్ని వార్తలు