Jeans Could Get Pricey: జీన్స్‌, టీషర్ట్స్‌ లవర్స్‌కు షాకింగ్‌ న్యూస్‌...!

29 Sep, 2021 19:02 IST|Sakshi

జీన్స్‌, టీ షర్ట్స్‌ అంటే యువతకు విపరీతమైన మోజు. ఏదైనా షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పుడు మనలో ఎక్కువగా ఫ్రీఫర్‌ చేసేది జీన్స్‌, టీషర్ట్సే...! కాగా రానున్న రోజుల్లో జీన్స్‌, టీషర్ట్స్‌ ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నాయి.దీనికి కారణం  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కాటన్‌ ధ‌ర‌లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, షిప్పింగ్‌ కంపెనీలు కాటన్‌ రవాణాకు భారీగా ఛార్జీలను వసూలు చేస్తుండటంతో కాటన్‌ ధరలు విపరీతంగా పెరిగాయి.
చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..!

భారత్‌తో సహా, అమెరికా లాంటి దేశాల్లో పత్తి పంటకు భారీ సమస్యలు తలెత్తడంతో కాటన్‌ దిగుబడి తగ్గిపోయింది. అంతేకాకుండా చైనా, మెక్సికో దేశాలు రికార్డు స్ధాయిలో కాటన్‌ను కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది నుంచి ఈ దేశాల నుంచి అమెరికా పూర్తిగా దిగుమతులను నిలిపివేసింది. భారీ మొత్తంలో కాటన్‌ను కొనుగోలు చేసి కృత్రిమ కొరతను సృష్టించేలా చైనా ముందుకు సాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  గ‌త ప‌దేళ్ల‌లో తొలిసారి కాట‌న్ ఫ్యూచ‌ర్స్ పౌండ్ (సుమారు 453 గ్రాములు)కు ఒక డాల‌ర్‌కు చేరింది. 

అంతర్జాతీయంగా కాటన్‌ ధరలు పెరగడంతో పలు జీన్స్‌, టీ షర్ట్స్‌ కంపెనీలు త్వరలోనే భారీగా ధరలను పెంచేందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తోంది. కాటన్‌ ధరల పెరుగుదల  లివైస్‌ స్ట్రాస్‌లాంటి పెద్ద కంపెనీలకు భారీ ఎత్తున్న ప్రభావితం చేస్తున్నాయి. న్యూయర్క్‌లో డిసెంబర్‌ నెలలో కాటన్‌ షిప్పింగ్‌ ఛార్జీలు ఒక పౌండ్‌కు 3.6 శాతం పెరిగి 1.0155 డాలర్లకు చేరుకుంది.  2011, న‌వంబ‌ర్ త‌ర్వాత ఈ స్థాయిలో పెర‌గ‌డం ఇదే తొలిసారి. ఈ ఏడాది మొత్తంగా ధ‌ర 28 శాతం పెరిగింది. ఎందుకైనా మంచిది ఈ పండుగ సీజన్‌లో ఓ నాలుగైదు జీన్స్‌ ఎక్కువ కొనుక్కోవడం మంచిందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
చదవండి: Netflix: ఓటీటీలో సినిమా, వెబ్‌సిరీస్‌లేకాదు..గేమ్స్‌ కూడా..!

మరిన్ని వార్తలు