జీప్‌ మెరిడియన్‌.. ఇది మేడ్‌ ఇన్‌ ఇండియా

14 Feb, 2022 18:13 IST|Sakshi

ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మంచి పట్టున్న జీప్‌ సంస్థ 7 సీటర్‌ వెహికల్‌ను మార్కెట్‌లోకి తెస్తామంటూ ఎప్పటి నుంచో చెబుతోంది. టెస్ట్‌ రైడ్‌ సందర్భంగా పలుమార్లు జీప్‌ 7 సీటర్‌ ఎస్‌యూవీ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఎస్‌యూవీకి ఏ పేరు పెడతారనే ఆసక్తి మొబైల్‌ ఇండస్ట్రీలో నెలకొని ఉండేది. దాదాపు 70 పేర్లను పరిశీలించిన జీప్‌ ఇండియా చివరకు మెరిడియన్‌ పేరును ఫిక్స్‌ చేసింది. ఈ మెరిడియన్‌ పూర్తిగా మేడిన్‌ ఇండియా అని ఇది ఇండియన్ల కోసమే తయారు చేశామని చెబుతున్నారు.

జీప్‌ మెరిడియన్‌ 7 సీటర్‌ ఎస్‌యూవీకి సంబంధించి కేవలం పేరు ఒక్కటే వెల్లడైంది. ఇంజన్‌ సామర్థ్యం, ఇన్ఫోంటైన్‌మెంట్‌, ఇతర ఫీచర్లకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ జీప్‌ మెరిడియన్‌లో కచ్చితంగా ఉండబోయే ఫీచర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల అంచనాలు ఇలా ఉన్నాయి
- పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్‌లలో వస్తుంది. 2.0 ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం
- 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ బాక్స్‌
- 10.25 ఇంచ్‌ ఇన్ఫోంటైన్‌మెంట్‌ స్క్రీన్‌
- పనోరమిక్‌ సన్‌రూఫ్‌
- 4 జోన్‌ వెదర్‌ కంట్రోల్‌
- ఫ్రంట్‌ వెంటిలేడెట్‌ సీట్స్‌
- టయోటా ఫార్చునర​, ఎంజీ గ్లూస్టర్‌ , స్కోడా కోడియాక్‌ రేంజ్‌లో రూ. 35 లక్షల దగ్గర జీప్‌ 7 సీటర్‌ ఎస్‌యూవీ ధర ఉండవచ్చని అంచనా

మరిన్ని వార్తలు