ఫస్ట్‌ టైం.. బెజోస్‌-మస్క్‌ మధ్య ఓ మంచి మాట

17 Sep, 2021 14:01 IST|Sakshi

పోటీ ప్రపంచంలో దిగజారి తిట్టుకోవడంలో ఆ ఇద్దరు బిలియనీర్లతో పోటీపడేవాళ్లెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. నువ్వెంత అని ఒకరంటే.. అసలు ఎవరు నువ్వు? అనే తత్వం మరొకరిది. ఒకరు ఒక రంగంలో అడుగుపెడితే.. ఆ వెనకే అదే రంగంలోకి అడుగుపెడతారు మరొకరు. పోటాపోటీ ప్రయోగాలు.. ప్రదర్శనలతో వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఒకరి మీద ఒకరు కోర్టులకు ఎక్కుతూ.. ఇష్టమొచ్చినట్లు తిట్టుకుంటారు.   అలాంటి ఈ ఇద్దరు..  మొట్టమొదటిసారి తమ స్వభావాలకు భిన్నంగా ప్రవర్తించడం అంతర్జాతీయ మీడియా సమాజాన్ని అమితంగా ఆకర్షించింది ఇప్పుడు.
   

ఎలన్‌ మస్క్‌ ఈ పేరు చెప్పగానే టెస్లా కార్లు, స్పేస్‌ ఎక్స్‌ ఏజెన్సీ అంతరిక్ష ప్రయోగాలతో పాటు రొటీన్‌కు భిన్నంగా సాగే ప్రయత్నాలు.. ప్రయోగాలు కళ్ల ముందు మెదలాడుతాయి.  ఇక జెఫ్‌ బెజోస్‌ పేరు వినగానే..  గుండుతో మెరిసే రూపం కళ్ల ముందు మెదలాడుతుంది.  ఆన్‌లైన్‌లో బుక్స్‌ అమ్మాలనే ఆలోచనతో మొదలైన అమెజాన్‌ ప్రస్థానాన్ని..  ఈ-కామర్స్‌ రంగంలో మహా సామ్రాజ్యంగా విస్తరించిన ఘనత బెజోస్‌ది.  అలాంటి వ్యాపార దిగ్గజాలు ఇద్దరూ జస్ట్‌ ఒకే ఒక్క ట్వీట్‌తో సంభాషించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

చదవండి: ఎలన్‌ మస్క్ దమ్ము ఇది
 

తాజాగా స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా ‘ఇన్‌స్పిరేషన్‌ 4’ ద్వారా స్పేస్‌ టూరిజంలో కొత్త ఒరవడిని సృష్టించాడు మస్క్‌. ఇక నుంచి కొందరు తమ బాటలోనే పయనిస్తారంటూ పరోక్షంగా బెజోస్‌(బ్లూఆరిజిన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఓనర్‌) పైనే సెటైర్లు వేశాడు కూడా.  కానీ, బెజోస్‌ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో స్పందించాడు.  ఈ ప్రయోగం సక్సెస్‌ కావడంపై మస్క్‌కు, స్పేస్‌ఎక్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీటేశాడు. దానికి మస్క్‌ సింపుల్‌గా ‘థ్యాంక్స్‌’ అని స్పందించాడు. ఈ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే.. భగ్గుమంటుదనే రేంజ్‌ శతత్రుత్వం ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అందుకే వీళ్ల సంభాషణపై కొందరు ఎలా రియాక్ట్‌ అయ్యారో కింద ఓ లుక్కేస్కోండి.


చదవండి: దెబ్బ మీద దెబ్బ.. ముదురుతున్న వివాదాలు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు