Jeff Bezos: ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్‌ బెజోస్‌..!

7 Sep, 2021 22:41 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. బెజోస్‌ అంతరిక్షయాత్రపై నెటిజన్లు తీవ్ర విమర్శలను గుప్పించారు. అంతేకాకుండా కొంతమంది తమ అమెజాన్‌ ప్రైమ్‌ అకౌంట్‌ ఖాతాలను వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. కాగా తాజాగా జెఫ్‌ బెజోస్‌ మరో ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!

మానవుడు ఎల్లప్పుడు యవ్వనంగా ఉండేందుకు చేస్తోన్న ప్రయోగాలకు ఊతం ఇస్తూ ఆయా కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఆల్టోస్‌ ల్యాబ్స్‌ యాంటీ ఏజింగ్‌పై పరిశోధనలను చేస్తోంది. ఈ కంపెనీ వెనుక జెఫ్‌బెజోస్‌ ఉ‍న్నట్లు ఏమ్‌ఐటీ టెక్‌ రివ్యూలో తెలిసింది. మానవ కణాలను రిప్రోగ్రామ్‌ చేయడం ద్వారా మానవుడుకి వృద్దాప్యం దరిచేరకుండా ఆల్టోస్‌ ల్యాబ్స్‌ పరీక్షలను చేస్తోంది. 

ఆల్టోస్‌ ల్యాబ్‌లో జెఫ్‌ బెజోస్‌ ఇన్వెస్ట్‌ చేసిన కొద్దిరోజులకు కంపెనీ భారీ వేతనాలతో పలు శాస్త్రవేత్తలను నియమించుకున్నట్లు ఎమ్‌ఐటీ టెక్‌ రివ్యూలో తెలిసింది. ఈ విషయంపై జెఫ్‌బెజోస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీస్‌ స్పందించలేదు. యాంటీ ఏజింగ్‌ పరిశోధనలపై ఇన్వెస్ట్‌ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో యూనిటీ టెక్నాలజీస్‌ అనే బయోటెక్‌ సంస్థలో కూడా ఏర్పాటు చేయనుంది. ఎమ్‌ఐటీ టెక్ రివ్యూ ప్రకారం యాంటీ ఏజింగ్‌ పరిశోధనలో భాగంగా ఆల్టోస్ ల్యాబ్స్ కణాల రీప్రోగ్రామింగ్ టెక్నాలజీపై దృష్టిసారించింది. 2012లో నోబుల్‌ అవార్డును గెలిచిన షిన్యా యమనాకా ఆల్టోస్‌ ల్యాబ్స్‌కు సైంటిఫింక్‌ అడ్వైజరీ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నారు. 

చదవండి: దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! భూమిని ఢీ కొట్టనుందా..! నాసా ఏమంటుంది..?


 

మరిన్ని వార్తలు