Amazon Shares: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌!

1 May, 2022 13:17 IST|Sakshi

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌ తగిలింది. గురువారం ప్రకటించిన అమెజాన్‌ క్యూ1 ఫలితాలతో గంటల వ్యవధిలో బెజోస్‌ బిలియన్‌ డాలర్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

గురువారం అమెజాన్‌ క్యూ1 ఫలితాల్ని ప్రకటించింది. ఈ ఫలితాల్లో 2015 తర్వాత ఈ ఏడాదిలో అత్యధికంగా 3.84 బిలియన్‌ డాలర్ల నష్టాల్ని చవిచూసింది. దీంతో అప‍్రమత్తమైన షేర్‌ హోల్డర్లు అమ్మకాలు జరిపారు. ఫలితంగా గంటల వ్యవధిలో ఆ సంస్థ బిలియన్‌ డాలర్లు నష‍్టపోగా.. ఒక్క మార్చి నెలలోనే అత్యంత దారుణంగా ట్రేడింగ్‌ జరిగిన టెక్నాలజీ షేర్ల విభాగంగా అమెజాన్‌ షేర్లు ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.  

బ్లూం బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌
అమెజాన్‌ క్యూ1 ఫలితాలు ఆ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపదపై ప్రభావం చూపాయి. గురువారం రోజు అమెజాన్‌ 14.05 శాతం నష్టపోవడంతో జెఫ్‌ బెజోస్‌ గంటల వ్యవధిలో 20.5 బిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో రూ.1.56లక్షల కోట్లు) నష్టపోయారు. కాగా, బ్లూం బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ జాబితాలో బెజోస్‌ సంపద తగ్గి 148.4 బిలియన్‌ డాలర్లతో సరిపెట్టుకున్నారు.

చదవండి👉ఫెస్టివల్‌ సీజన్‌: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఆఫర్లే ఆఫర్లు! ఇక 'పండగ' చేస్కోండి!

మరిన్ని వార్తలు