Jeff Bezos: బ్రిటిష్‌ రాజకుటుంబం కంటే రెండింతల ఆస్తితో రిటైర్డ్‌..!

5 Jul, 2021 18:36 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ తాను స్థాపించి, పెంచి పెద్ద చేసిన అమెజాన్‌కు నేటి నుంచి గుడ్‌బై చెప్పనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మార్చిన అమెజాన్‌ కంపెనీ సీఈవో పదవికి జులై 5న ఆయన పదవి విరమణ చేశారు. అమెజాన్‌ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో  ప్రజలు ఎక్కువగా  ఆన్‌లైన్ సేవల వైపు మొగ్గు చూపడంతో అమెజాన్ 2020లో గణనీయంగా లాభాలను గడించింది. దీంతో అమెజాన్‌ వ్యవస్తాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్ వ్యక్తిగత సంపద గణనీయంగా పెరిగింది.సుమారు 2020 సంవత్సరంలో 75 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా జెఫ్‌ బెజోస్‌ 1994 జూలై 5 న తొలిసారిగా అమెజాన్‌తో ఆన్‌లైన్‌లో పుస్తకాలను విక్రయించడం మొదలుపెట్టాడు. 

ప్రస్తుతం బెజోస్‌ బ్లూ ఆరిజిన్‌ సంస్థ చేపట్టే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్దమైతున్న విషయం తెలిసిందే. జెఫ్‌ బెజోస్‌ సంపద విషయానికొస్తే.. బెజోస్ మొత్తం బ్రిటిష్ రాజకుటుంబ సంపద కంటే రెండింతలు ఎక్కువ సంపదతో పదవి విరమణ తీసుకున్నారు. బ్రిటిష్ రాజకుటుంబం సంపద సుమారు 88 బిలియన్‌ డాలర్లను కలిగి ఉన్నారు. 

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..  జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 203 బిలియన్ల డాలర్లు. 2018 నుంచి 2020 వరకు బిల్ గేట్స్ నికర ఆస్తి విలువ  రూ .6.12 లక్షల కోట్ల నుంచి రూ .8.58 లక్షల కోట్లకు ఏగబాకింది.  ఒక నివేదిక ప్రకారం, అతని సంపద  73 శాతం పెరిగింది. బెజోస్‌ తన పెన్షన్‌ను కవర్ చేయడానికి సుమారు 197 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు