Mukesh Ambani: హీటెక్కిస్తోన్న ఐపీఎల్‌...ఢీ అంటే ఢీ అంటోన్న ముఖేశ్‌ అంబానీ, జెఫ్‌ బెజోస్‌..!

31 Mar, 2022 16:53 IST|Sakshi

గత కొన్నేళ్లుగా భారత్‌లో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, ముఖేష్‌ అంబానీలు తమ ఆధిపత్యం కోసం ఇరువురు పోటాపోటీగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఫ్యుచర్‌ గ్రూప్‌కు చెందిన వ్యాపారాలను పూర్తిగా హస్తగతం చేసుకుందమని భావిస్తోన్న ముఖేష్‌ అంబానీకి అమెజాన్‌  అడ్డుగా నిల్చుంది. ప్రస్తుతం ఈ కంపెనీలు ఐపీఎల్ ప్రసార హక్కుల (డిజిటల్‌)ను తీసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కులపై అమెజాన్, రిలయన్స్ ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. ప్రసార హక్కుల విషయంలో ఇప్పుడు ఇరువురి మధ్య ఐపీఎల్‌ మరో  తీవ్రమైన పోటీకి దారితీస్తోంది. 

మూహుర్తం ఖరారు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను వేలం వేయడానికి మార్గదర్శకాలు ఈ వారంలో వెలువడనున్నాయి. ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కోసం వేలం పాటలను త్వరలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఐపీఎల్‌ చరిత్రలో మొదటిసారిగా....టెలివిజన్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి, వాటిని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడానికి హక్కులు విడిగా విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను దక్కించుకునేందుకుఅమెజాన్‌ ప్రైమ్‌ వీడియా, జియో సిద్దమైనాయి. బ్రాడ్‌ కాస్టింగ్‌ హక్కులను పొందేందుకు ఇరు కంపెనీలు తీవ్రంగా పోటీ పడనున్నట్లు సమాచారం. 

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఈ-కామర్స్ ఆధిపత్యం కోసం ఇరు కంపెనీలు పోరాడుతున్నందున, అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా విజయం సాధించాలని నిశ్చయించుకుంది. ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించిన వేలం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. వీటిని దక్కించుకునేందకు ఆయా కంపెనీలు బిడ్స్‌ వేస్తూ గెల్చుకోవాల్సి ఉంటుంది. 

బీసీసీఐపై కాసుల వర్షం..!
ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ వేలం జూన్‌  12న జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకు కాసుల వర్షం కురియనుంది. బ్రాడ్‌ కాస్టింగ్‌ హక్కులతో బీసీసీఐకి దాదాపు రూ. 40,000 నుంచి రూ. 45,000 కోట్ల ఆదాయం ఖజానాలో చేరనున్నుట్లు సమాచారం. వేలం గెల్చుకున్న సంస్థలు  2023 నుంచి 2027 వరకు 5 సంవత్సరాల పాటు ఐపీఎల్‌ ప్రసార హక్కులను పొందుతాయి.  2018 నుంచి 2022 వరకు ఐపీఎల్‌ ప్రసార హక్కులను స్టార్ ఇండియాకు రూ. 16,347.50 కోట్ల రూపాయలకు విక్రయించింది. స్టార్ ఇండియా మాతృ సంస్థ వాల్ట్ డిస్నీ అని తెలిసిందే. కాగా పలు నివేదికల ప్రకారం..ఐపీఎల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ హక్కులను దక్కించుకునేందుకు అమెజాన్‌, రిలయన్స్‌తో పాటుగా సోనీ గ్రూప్, వాల్ట్ డిస్నీతో పోటీ పడనున్నాయి.

చదవండి: అమెరికా సంచలన నిర్ణయం..! చైనాకు చావు దెబ్బే..?

మరిన్ని వార్తలు