ఐపీవోకి జెసన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 900 కోట్ల సమీకరణ

23 Nov, 2021 09:27 IST|Sakshi

సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ 

న్యూఢిల్లీ: స్పెషాలిటీ కోటింగ్‌ ఎమల్షన్స్‌ తయారీ సంస్థ జెసన్స్‌ ఇండస్ట్రీస్‌ .. పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. ఐపీవో ద్వారా సుమారు రూ. 800–900 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది.. ఇందుకు సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐపీవోలో భాగంగా రూ. 120 కోట్ల విలువ చేసే షేర్లు కొత్తగా జారీ చేయనుండగా .. 1.21 కోట్ల షేర్లను ప్రమోటర్‌ ధీరేష్‌ శశికాంత్‌ గొసాలియా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రయించనున్నారు. ప్రస్తుతం గొసాలియాకు కంపెనీలో 86.53 శాతం వాటాలు ఉన్నాయి. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో దాదాపు రూ. 90 కోట్లు.. రుణాల తిరిగి చెల్లింపునకు ఉపయోగించనుంది.

జేసన్స్‌
పెయింట్స్, ప్యాకేజింగ్, కెమికల్స్‌ తదితర రంగాలకు అవసరమైన స్పెషాలిటీ కోటింగ్‌ ఎమల్షన్స్‌ (ఎస్‌సీఈ), నీటి ఆధారిత ప్రెజర్‌ సెన్సిటివ్‌ అడ్హెసివ్స్‌ (పీఎస్‌ఏ) మొదలైన ఉత్పత్తులను జెసన్స్‌ ఇండస్ట్రీస్‌ తయారు చేస్తోంది. ఆసియా–పసిఫిక్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా తదితర మార్కెట్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 901 కోట్ల ఆదాయంపై రూ. 30 కోట్ల లాభం ఆర్జించింది. 2021లో ఆదాయం 20 శాతం పెరిగి రూ. 1,086 కోట్లకు, లాభం 213 శాతం ఎగిసి రూ. 93 కోట్లకు చేరింది.   

చదవండి: మెడ్‌ప్లస్‌ హెల్త్, రేట్‌గెయిన్‌ ఐపీవోలకు ఆమోదం

మరిన్ని వార్తలు