Jet Airways 2.0: రెక్కలు తొడిగి, మళ్లీ నింగిలోకి జెట్ ఎయిర్ వేస్..!

20 May, 2022 19:31 IST|Sakshi

అప‍్పులతో కుదేలైన ప్రముఖ ఏవియేషన్‌ సంస్థ జెట్‌ ఎయిర్‌ వేస్‌ తిరిగి తన కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) జెట్‌ ఎయిర్‌ వేస్‌కు ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌(ఏఓసీ)ని అందించింది


మే5,1993న నరేష్‌ గోయల్‌ జెట్‌ ఎయిర్‌ వేస్‌ పేరుతో తొలి కమర్షియల్‌ ఫ్లైట్‌ను ప్రారంభించారు. 100 పైగా విమానాలతో జెట్ ఎయిర్‌ వేస్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. కానీ మార్కెట్‌లో కాంపిటీషన్‌, ఫ్లైట్‌ నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఆ సంస్థ ఏప్రిల్‌ 18,2019 నాటికి ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో జాతీయ అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

తాజాగా,ఈ సంస్థను యూఏఈకి చెందిన వ్యాపార వేత్త మురారి జలాన్, యూకేకి చెందిన కల్రాక్ క్యాపిటల్‌ సంస్థలు ఒప్పొంద ప్రాతిపదికన జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడం,పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థల కన్సార్టియం జెట్‌ ఎయిర్‌ వేస్‌కు 180మిలియన్‌ల నిధుల్ని అందించనున్నాయి.  అందులో 60 మిలియన్‌లను అత్యవసర రుణాల్ని జెట్‌ ఎయిర్‌ వేస్‌ తీర్చనుంది. 

డీసీజీఏ వివరాల ప్రకారం
డీసీజీఏ వివరాల ప్రకారం.. జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఇప్పటికే తన కార్యకాలపాల్ని ప్రారంభించింది. మే15నుంచి మే17 మధ్య కాలంలో 5 విమానాల రాకపోకల్ని నిర్వహించింది. మిగిలిన కమర్షియల్‌ ఫ్లైట్‌లు జులై- సెప్టెంబర్‌ మధ్య కాలంలో ప్రారంభం కానున్నాయని డీసీజీఏ తెలిపింది.

చదవండి👉ఇండిగోకి కొత్త సీఈవో..ఆయన ఎవరంటే!

మరిన్ని వార్తలు