వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌కు గుడ్‌బై, ట్విటర్‌ వేదికగా జెట్‌ ఎయిర్‌ వేస్‌ సీఈవో అసహనం

13 Feb, 2023 16:26 IST|Sakshi

9 ఏళ్ల నుంచి మీ నెట్‌ వర్క్‌ వినియోగిస్తున్నా. ఇక నుంచి వేరే నెట్‌ వర్క్‌కు మారుతున్నా. దయచేసి నాకు ఫోన్‌ చేయకండి అంటూ ప్రముఖ ఏవియేషన్‌ సంస్థ జెట్‌ ఎయిర్‌ వేస్‌ సీఈవో సంజీవ్‌ కపూర్‌  ఓ టెలికం కంపెనీ కస్టమర్‌ కేర్‌ నిర్వాహకంపై అసహననానికి గురయ్యారు. అందుకు ఓ కారణాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్‌ వేదికగా చివాట్లు పెట్టారు. 

జెట్‌ ఎయిర్‌ వేస్‌ సీఈవో సంజీవ్‌ కపూర్‌ 9 ఏళ్ల నుంచి దేశీయ టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా నెట్‌ వర్క్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ నెట్‌ వర్క్‌ పనితీరు మందగించడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాజాగా సంజీవ్‌ కపూర్‌కు సైతం ఈ తరహా ఇబ్బంది తలెత్తింది. ఆదివారం నెట్‌ వర్క్‌ సరిగ్గా పనిచేయకపోవడం, అదే సమయంలో కస్టమర్‌ కేర్‌ నుంచి వరుస కాల్స్‌ రావడంతో ఇరిటేట్‌ అయ్యారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ట్విటర్‌ వేదికగా సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

నాకు ఫోన్‌ చేయడం ఆపండి అంటూ ట్వీట్‌ చేశారు. ప్రియమైన @ViCustomerCare: నెట్‌ వర్క్‌ మారవద్దని నన్ను ఒప్పించేందుకు పదే పదే కాల్స్‌ చేస్తున్నారు. అలా కాల్‌ చేయడం మానేయండి. నేను 9 సంవత్సరాల తర్వాత నెట్‌ వర్క్‌ ఎందుకు మారుతున్నానో మీకు చెప్పాను. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కవరేజీ తక్కువగా. కొందరికి రోమింగ్‌ కాల్స్‌ చేసుకోవడంలో ఇబ్బందికి గురవుతున్నారు. అంతే. ధన్యవాదాలు’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఆ ట్వీట్‌కు వీఐ కస్టమర్‌ కేర్‌ విభాగం స్పందించింది. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం అని రిప్లయి ఇచ్చింది. ఆ ట్వీట్‌కు సంజీవ్‌ రిప్లయి ఇచ్చారు. @ViCustomerCare దయచేసి నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించకండి. నిన్నటి నుండి నాకు డజను కాల్స్ వచ్చాయి. ఫోన్‌ చేయడం ఆపండి, అంతే! అని అన్నారు.  

అయినా సరే వీఐ కస్టమర్‌ కేర్‌ విభాగం సంజీవ్‌ కపూర్‌కు మరోసారి ఫోన్‌ చేసి విసిగించింది. దీంతో ఏం చేయాలో పోక...మా నెట్‌ వర్క్‌ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ ఫోన్‌ వచ్చింది. ఇది మంచి పద్దతి కాదు. ఫోన్‌ చేయడం ఎప్పుడు ఆపేస్తారో.. వీఐ యాజమాన్యం ఉన్నతాధికులు ట్విటర్‌లో ఉన్నారా? అంటూ ప్రశ్నిస్తూ మరోసారి ట్వీట్‌లు చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు