రెక్కలు తొడిగిన జెట్‌​ ఎయిర్‌వేస్‌

6 May, 2022 17:51 IST|Sakshi

ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్యకలాపాలు నిలిపేసిన జెట్ ఎయిర్‌వేస్‌ మళ్లీ రెక్కలు తొడిగింది. కమర్షియల్‌ విమాన సర్వీసులు నడిపేందుకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నుంచి అనుమతులు సాధించింది. దీంతో దాదాపు మూడేళ్ల తర్వాత తర్వాత జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమానం గాల్లోకి ఎగిరింది.

డీజీసీఏ నుంచి అనుమతి రావడంతో టెస్ట్‌ ఫ్లైట్‌ను ముందుగా నడిపించింది జెట్‌ ఎయిర్‌వేస్‌. 2022 మే5న హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి మొదటి విమానం బయల్ధేరింది. మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభించడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆ కంపెనీ సీఈవో సంజీవ్‌ కపూర్‌ తెలిపారు. ‍త్వరలోనే కమర్షియల్‌ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ చివరి కమర్షియల్‌ సర్వీస్‌ 2019 ఏప్రిల్‌ 17న నడిచింది.

చదవండి : సక్సెస్‌ అంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కాదంటున్న అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌

మరిన్ని వార్తలు