ఎలక్ట్రిక్ కారుగా సుజుకి జిమ్ని, ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!

18 Feb, 2023 16:14 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ దృష్టిలో ఉంచుకుని సైకిల్స్ నుంచి పెద్ద కమర్షియల్ వాహనాల వరకు ఎలక్ట్రిక్ వెర్షన్స్‌లో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి తమ పాపులర్ ఆఫ్ రోడర్ జిమ్నీని ఎలక్ట్రిక్ రూపంలో విడుదలచేయడానికి సన్నద్ధమవుతోంది.

మారుతి సుజుకి తన జిమ్నీ ఎస్‌యువిని 2026 నాటికి ఎలక్ట్రిక్ కారుగా తీసుకురానుంది. ఇది డిజైన్ పరంగా ఎక్కువ మార్పులకు లోనయ్యే అవకాశం లేదు. అయితే జిమ్ని ఎలక్ట్రిక్ కారు కావున ఫ్రంట్ బంపర్ కొత్తగా ఉంటుంది. ఇందులో ఛార్జింగ్ పోర్ట్ అమర్చిందట.


(జిమ్ని, ఫైల్ ఫోటో)

గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జిమ్ని 3-డోర్స్ మోడల్ ఎలక్ట్రిక్ కారుగా మొదట యూరప్ దేశాలలో విడుదలవుతుంది. కంపెనీ అనుకున్నట్లుగానే జిమ్ని ఎలక్ట్రిక్ విడుదల చేస్తే అమ్మకాలలో తప్పకుండా చరిత్ర సృష్టిస్తుంది.  జిమ్ని ఇటీవల 2023 ఆటో ఎక్స్‌పోలో 5 డోర్స్ రూపంలోవిడుదలైంది.

రాబోయే జిమ్నీ ఎలక్ట్రిక్ కారుని పూర్తిగా రీ-డిజైన్ చేయడం సులభమైన పని కాదు. పెట్రోల్ మోడల్ ఎలక్ట్రిక్ కారుగా రోపుదిద్దుకునే సమయంలో ఎక్కువ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ వంటి వాటిని అమర్చడం ఇతర మార్పులు ఇందులో చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కంపెనీ 2026 నాటికి విడుదల చేయనున్న తెసులుస్తోంది.

జిమ్నీ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికె ఆటో ఎక్స్‌పోలో కనిపించిన eVX కాన్సెప్ట్‌లో ఉపయోగించిన అదే 60kWh బ్యాటరీ ఉపయోగించే అవకాశం ఉంది. కంపెనీ ఇంజనీర్‌లకు మరింత స్థలం అవసరమైతే డబుల్-డెక్ బ్యాటరీ మాడ్యూల్‌ ఉపయోగించవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

మరిన్ని వార్తలు