Jio 5G: దేశంలో 5జీ సేవలు, జియో 5జీ ప్లాన్‌ వివరాలు ఇవేనా?

1 Oct, 2022 20:24 IST|Sakshi

దేశంలో 5జీ నెట్‌ అందుబాటులోకి వస‍్తే వాటి ధరలు భారీగా పెరుగుతాయా? పెరిగితే ఎంత పెరుగుతాయనే అంశాలపై వినియోగదారుల్లో చర్చ మొదలైంది. అయితే 5జీ సేవల్ని మోదీ ప్రారంభించిన అనంతరం ఆకాష్‌ అంబానీ మీడియాతో మాట్లాడారు. 

జియో సంస్థ వినియోగదారులకు ఆమోదయోగ్యంగా 5జీ ప్లాన్‌లను ప్రవేశ పెడుతుందని అన్నారు. ప్రతీ దేశ పౌరుడు 5జీ నెట్‌ వర్క్‌ను వినియోగించేలా ప్రొడక్ట్‌ నుంచి సర్వీసులు వరకు తక్కువ ధరకే అందిస్తామన్నారు.

5జీపై మోదీ చేసిన వ్యాఖ్యల‍్ని ఉటంకిస్తూ..1జీబీ డేటా గతంలో రూ.300 ఉంటే..ఇప్పుడు రూ.10కే లభ్యం అవుతుంది. యావరేజ్‌గా దేశ పౌరుడు నెలకు 14జీబీ డేటాను వినియోగిస్తే..దాని ధర రూ.4200, కానీ రూ.125 నుంచి రూ.150 మధ్యలో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో తొలిసారి 5జీ సేవలు ప్రారంభం కావడం.. జియో 5జీ ప్లాన్‌, సిమ్‌ కార్డ్‌ల గురించి చర్చ మొదలైంది. అంతేకాదు జియో 5జీ ప్లాన్‌ల ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయంటూ పలు నివేదికలు విడుదలయ్యాయి. 
 
జియో సిమ్‌ కార్డ్‌ 
ఈ ఏడాది ఆగస్ట్‌ 29న జరిగిన రిలయన్స్‌ 45వ ఏజీఎం సమావేశంలో 5జీ సేవల వినియోగంపై జియో ప్రకటన చేసింది. ఆ సందర్భంగా ఎటువంటి నెట్‌ వర్క్‌కు కనెక్షన్‌ లేకుండా స్టాండ్‌ అలోన్‌ (Standalone) అనే 5జీ సర్వసుల్ని అందిస్తామని చెప్పింది. దీంతో ఈ సేవల కోసం 4జీ సిమ్‌ కార్డ్‌ను వినియోగించలేమని, సిమ్‌ కార్డును 5జీ నెట్‌ వర్క్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని టెలికం నిపుణులు చెబుతున్నారు. 

జియో స్పీడ్‌ 
జియో సంస్థ దేశ వ్యాప్తంగా 8 నగరాల్లో 5జీ ట్రయల్స్‌ నిర్వహించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..ముంబైలో 4జీ కంటే 5జీ 8ఎక్స్‌ స్పీడ్‌తో జియో పనిచేస్తుందని, ట్రయల్స్‌లో జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 420 ఎంబీపీఎస్‌, అప్‌లోడ్‌ స్పీడ్‌ 412 ఎంబీపీఎస్‌ ఉంది. 

జియో 5జీ ధర 
దేశంలో జియో 4జీ ప్లాన్‌ ప్రారంభ ధర నెలకు రూ.239. రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అలాగే 5జీ ప్లాన్‌లు సైతం అదే తరహాలో ఉంటాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో ఇతర నెట్‌ వర్క్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేలా జియో 5జీ ప్రారంభ ధర నెలకు రూ.400 నుంచి రూ.500 మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు