తిరుగులేని జియో.. భారీగా పెరిగిన యూజర్లు

21 Dec, 2023 07:22 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో రిలయన్స్‌ జియో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ యూజర్ల సంఖ్య మరో 34.7 లక్షలు పెరిగి మొత్తం 44.92 కోట్లకు చేరింది. అటు పోటీ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్స్‌ 13.2 లక్షలు పెరగ్గా వొడాఫోన్‌ ఐడియా యూజర్లు 7.5 లక్షలు తగ్గారు.

టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్‌టెల్‌ యూజర్ల సంఖ్య 37.77 కోట్లుగా, వొడాఫోన్‌ ఐడియా సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య 22.75 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌ ఆఖరు నాటికి మొత్తం వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య 115 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య 63 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య 52 కోట్లకు చేరింది.  

88.5 కోట్లకు బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు.. 
ట్రాయ్‌ గణాంకాల ప్రకారం మొత్తం బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల సంఖ్య ఆగస్టులో 87.65 కోట్లుగా ఉండగా సెప్టెంబర్‌ ఆఖరు నాటికి 88.5 కోట్లకు చేరింది. టాప్‌ 5 సర్వీస్‌ ప్రొవైడర్ల మార్కెట్‌ వాటా 98.35 శాతంగా ఉంది. ఇందులో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ (45.89 కోట్లు), భారతి ఎయిర్‌టెల్‌ (25.75 కోట్లు), వొడాఫోన్‌ ఐడియా (12.65 కోట్లు), బీఎస్‌ఎన్‌ఎల్‌ (2.51 కోట్లు) ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు