2021 ప్రారంభంలో జియో ఎంట్రీ లెవల్ 4జీ ఫోన్‌

7 Dec, 2020 20:25 IST|Sakshi

రిలయన్స్ జియో గూగుల్ సహకారంతో రాబోయే ఎంట్రీ లెవల్ ఫోన్‌ను 2021 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయబోతున్నట్లు ఒక నివేదిక తెలిపింది. ఈ ఫోన్ డిసెంబరు నాటికి వస్తుందని అందరూ ఊహించారు. కానీ, జియో ఆండ్రాయిడ్ ఫోన్ ఇంకా పరీక్ష దశలో ఉండటం వల్ల దీనిని తీసుకురావడానికి మరో 3 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. భారతదేశంలో ప్రజలను ఆకర్షించడానికి జియో తీసుకురాబోయే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 4,000 ఉండనున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం రానున్న రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్ ఫోన్లను జియో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.(చదవండి: గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్

జూలైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ 4జీ ఫోన్ ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. జియోలో 7.7శాతం వాటా కోసం గూగుల్ 33,737కోట్లు పెట్టుబడి పెట్టింది. గూగుల్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం త్వరలో రాబోయే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ గో ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు సమాచారం. 2017 జులైలో మనదేశంలో మొదటి 4జీ ఫీచర్ ఫోన్‌ను జియో లాంచ్ చేసింది. ఆ తర్వాత జియో ఫోన్ 2ను జియో లాంచ్ చేసింది. "జియో ప్లాట్‌ఫామ్‌ భాగస్వామ్యం ద్వారా దేశంలో మరింత ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని" అని గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్‌తో పాటు క్వాల్ కాం కూడా జియోలో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. మనదేశానికి 5జీ కనెక్టివిటీ తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫేస్‌బుక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబదాలా, ఎడిఐఎ, టిపిజి, ఎల్ కాటర్టన్, పిఐఎఫ్, ఇంటెల్ క్యాపిటల్ మరియు క్వాల్కమ్ వెంచర్స్ తర్వాత జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టిన 14వ పెట్టుబడిదారుగా గూగుల్ నిలిచింది.

మరిన్ని వార్తలు