జియోలో సరికొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ ఆఫర్లు..

22 Sep, 2020 19:07 IST|Sakshi

ముంబై: వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను జియో సంస్థ ప్రకటించింది. జియో సంస్థ పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ విభాగాలలో వివిధ ఆఫర్లు ప్రకటించింది. దేశీయ టెలికం రంగాలలో ఎన్నో సంచాలనాలు సృష్టించామని, 40కోట్ల వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నామని జియో సంస్థ డైరెక్టర్‌ ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌, విదేశాలలో ప్రయాణించే వారికి రోమింగ్‌ సేవలు లాంటి సరికొత్త సేవలతో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ ఆకట్టుకోనుందని అంబానీ తెలిపారు. మరోవైపు వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తామని సంస్థ తెలిపింది. తాజా పోస్ట్‌పెయిడ్‌ సేవలతో జియోలో కొత్త వినియోగదారులు సైతం మొగ్గు చూపే అవకాశమున్నట్లు సంస్థ అభిప్రాయపడింది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లస్‌:
నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ, హాట్‌స్టార్‌లలో సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చు. జియో యాప్‌లో 650లైవ్‌ చానెల్స్‌, వీడియో కంటెంట్‌లు, 300పైగా వార్తాపత్రికలను సబ్‌స్క్రిప్షన్ ద్వారా పొందవచ్చు.

ఫీచర్‌ ప్లస్‌:
250 రూపాయలతో జియో ఫ్యామిలీ ప్లాన్‌
500జీబీ వరకు డేటా రోలోవర్‌
భారత్‌ విదేశాలలో వైఫై సేవలు

ఇంటర్‌నేషనల్‌ ప్లస్‌
విదేశాలకు వెళ్లె దేశీయ ప్రయాణికుల కోసం యూఎస్‌, యూఏఈలో ఫ్రీ రోమింగ్‌ సేవలు

ఎక్స్‌పీరీయన్స్‌ ప్లస్‌
ఫ్రీ హోమ్‌ డెలివరీ, యాక్టివేషన్‌, ప్రీమియమ్‌ కాల్‌ సెంటర్‌ సేవలు 
జియో పోస్ట్‌ పేడ్‌ సేవలు కావాలంటే, జియో వినియోగదారులు వాట్సాప్‌​ నెంబర్‌ 88 501 88 501కు మెసేజ్‌ చేయాలి. అయితే జియో పోస్ట్‌పేడ్‌ సేవలు మార్కెట్‌లో సెప్టెంబర్‌ 24(గురువారం) విడుదల కానుంది. జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు http://jio.com/store-locator వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు

జియో టారీఫ్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ ప్లాన్స్‌: 399 రూపాయలతో 75జీబీ డేటా, 599 రూపాయలతో 100 జీబీ డేటా, 799 రూపాలతో 150జీబీ డేటా, 999 రూపాయలతో 200జీబీ డేటా, 1499 రూపాయలతో 300జీబీ డేటా పొందవచ్చు
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా