IPL 2023: జియో అదిరిపోయే ఆరు ప్రీపెయిడ్ ప్లాన్స్‌  

24 Mar, 2023 14:49 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో క్రికెట్ పండుగ ప్రారంభానికి ముందు టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో క్రికెట్ అభిమానులకు 6 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఐపీఎల్ 2023  మార్చి 31 నుంచి  షురూ కానున్న నేపథ్యంలో  క్రికెట్‌ అభిమానుల కోసం ఈ  కొత్త ప్లాన్లను జియో ప్రకటించింది.  (జియో కస్టమర్లకు భారీ షాక్‌: ఎంట్రీ-లెవల్ బాదుడే మామూలుగా)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కి  ప్రారంభానికి ముందు రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది.ఐపీఎల్‌ , ఈసారిJioCinema యాప్‌లో వీక్షించే వినియోగదారులకు ఇవి మరింత సౌకర్యంగా మారనున్నాయి.  4కేలో గేమ్‌ను చూడాలంటే ఎక్కువ డేటా కావాల్సిందే. అందుకే జియో కస్టమర్ల కోసం ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వీటిల్లో మూడు వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలతో పాటు అపరిమిత డేటాప్రయోజనాలతో వస్తాయి మిగిలిన మూడు డేటా యాడ్-ఆన్ వోచర్‌లు మాత్రమే అనేది గమనించాలి.

(ఇదీ చదవండి: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్‌... అదీ ఐపీఎల్‌కు ముందు)

 జియో రూ.999, రూ.399, రూ.219, రూ.222, రూ.444, రూ.667 ప్లాన్‌ల వివరాలు 

రూ.999: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజూ 3జీబీ హై స్పీడ్ డేటా ఉచితం. ఇక అపరిమిత కాల్స్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. ఇవి కాకుండా మరో రూ.241 వోచర్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 40 జీబీ బోనస్ డే డేటా కూడా ఉంటుంది. 

రూ.399, రూ.219: ఈ రెండు ప్లాన్లలో రోజువారీ 3జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్. ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. రూ.399 ప్లాన్ లో రూ.61 విలువైన వోచర్ ఉచితంగా వస్తుంది. 6జీబీ అదనపు డేటా కూడా పొందొచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు. 6 జీబీ బోనస్ డేటా రూ.219 ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. రోజువారీ 3 జీబీ ఉచిత డేటాకు అదనంగా  2 జీబీ  బోనస్‌ డేటా ఉచితం. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు)

డేటా యాడ్‌ ఆన్‌   ప్లాన్స్‌
డేటా యాడ్-ఆన్ వోచర్‌లు  బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌పై  అదనపు డేటా
రూ.222ప్లాన్‌లో ప్రస్తుత ప్లాన్ ఎక్స్ పైరీ గడువు 50జీబీ డేటా లభిస్తుంది. 
రూ.444: ఈ ప్లాన్ లో 100 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 60 రోజులు. 
రూ.667 డేటా ప్యాక్ తో 150 జీబీ ఉచిత డేటా వస్తుంది. 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

మరిన్ని వార్తలు