జియో గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా మొబైల్‌ రీచార్జ్‌

10 Jun, 2021 10:20 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం సంస్థ రిలయన్స్‌ జియో కస్టమర్లు ఇక నుంచి వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా మొబైల్‌ రీచార్జ్‌ చేసుకోవచ్చు. పోర్ట్‌–ఇన్, జియో సిమ్‌ కొనుగోలు చేయవచ్చు. జియో ఫైబర్, జియోమార్ట్, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ సపోర్ట్‌ పొందవచ్చు. ఈ–వాలెట్స్, యూపీఐ, క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్స్‌ చెల్లింపులు జరపడంతోపాటు ఫిర్యాదులు, సందేహాల నివృత్తి, ఇతర సమాచారం అందుకోవచ్చు.

ఇందుకోసం 7000770007 నంబరును కస్టమర్లు వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీలో సేవలు అందుబాటులో ఉన్నాయి. క్రమంగా ఇతర భాషలనూ పరిచయం చేస్తారు. జియో ఫైబర్‌ సేవలనూ త్వరలో ఈ నంబరుకు అనుసంధానించనున్నారు. చాట్‌బాట్‌ ద్వారా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ సమాచారం కూడా కస్టమర్లు తెలుసుకోవచ్చు. పిన్‌కోడ్, ప్రాంతం పేరు టైప్‌ చేస్తే చాలు.. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందా లేదా చాట్‌బాట్‌ తెలియజేస్తుంది.

చ‌ద‌వండి: జియో ఫోన్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త!
 

మరిన్ని వార్తలు