జియో సంచలనానికి ఐదేళ్లు..! ట్విటర్‌లో క్యూ కట్టిన పలు కంపెనీలు

6 Sep, 2021 20:56 IST|Sakshi

న్యూఢిల్లీ: జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదుచేసింది. 2021 సెప్టెంబర్‌ 5తో జియో ఐదు వసంతాలను పూర్తి చేసుకుంది. అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్‌ను అందించిన మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్‌ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్‌ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. 2016 సెప్టెంబర్‌ 5న జియో నెట్‌వర్క్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసింది.   
చదవండి: ఎయిర్‌టెల్‌, జియో మధ్య ముగిసిన భారీ డీల్‌..!

జియో ప్రారంభ‌మై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పలు దిగ్గజ కంపెనీలు జియోకు శుభాకాంక్షలను తెలియజేశాయి. గూగుల్‌, జోమాటో, నెట్‌ఫ్లిక్స్‌, పేటీయం, హెచ్‌డీఎఫ్‌సీ, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో , ఫోన్‌పే, అపోలో హస్పిటల్స్‌, అశోక్‌ లేల్యాండ్‌, టిండర్‌ ఇండియా, వూట్‌, జీ5, శాంసంగ్‌ ఇండియా, వివో, ఓప్పో, డొమినోస్‌ ఇండియా, సోనీ లివ్‌, నోకియా, మైక్రో మ్యాక్స్‌, ఆన్‌అకాడమీ లాంటి  కంపెనీలు జియోకు ట్విటర్‌లో శుభాకాంక్షలను తెలియజేశాయి.  

భార‌త్‌లో జూన్ 2021 వ‌ర‌కు.. మొబైల్‌, బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థలో అత్యంత మార్కెట్ షేర్‌ను క‌లిగిన సంస్థగా జియో నిలిచిందని ట్రాయ్‌ పేర్కొంది. ట్రాయ్‌ నివేదిక ప్రకారం బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల గత 5 సంవత్సరాలలో డేటా వినియోగదారుల సంఖ్య 4 రెట్లు పెరిగిందని పేర్కొంది. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్ 2016 లో 19.23 కోట్ల నుంచి జూన్ 2021 నాటికి 79.27 కోట్లకు చేరింది. 2016 డిసెంబరు నుంచి మార్చి 2021 మధ్యకాలంలో ప్రతి వినియోగదారుడు నెలవారీ డేటా వినియోగం 878.63 ఎమ్‌బీ నుంచి 12.33జీబీ సుమారు 1,303 శాతానికి పైగా  డేటా వినియోగం పెరిగింది.
చదవండి: Jio Phone Next: రూ.500కే జియో స్మార్ట్‌ ఫోన్‌, షరుతులు వర్తిస్తాయ్‌!

మరిన్ని వార్తలు