జియో చేతికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రా..ఎన్‌సీఎల్‌టీ ఆమోదం!

21 Nov, 2022 21:35 IST|Sakshi

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ సొంతం చేసుకునేలా జియోకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ కు చెందిన టవర్లు, ఫైబర్‌ ఆస్తులు జియో సొంతం కానున్నాయి.

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా దివాలా తీయడంతో ఆ కంపెనీ స్వాధీనానికి ముకేశ్‌ అంబానీ 2019 నవంబర్‌లో రూ.3,720 కోట్లతో బిడ్‌ దాఖలు చేశారు. అయితే ఈ బిడ్డింగ్‌ను  వ్యతిరేకిస్తూ రుణదాతలు కోర్టును ఆశ్రయించారు.

ఆ కేసు కొనసాగుతుండగా... గత నెల జియో ఎన్‌సీఎల్‌టీ ఆశ్రయించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. ఆలస్యమయ్యేకొద్దీ ఇరువర్గాలకూ నష్టం చేకూరుతుందని, ఆస్తుల విలువ కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ క్రమంలో ఎన్‌సీఎల్‌టీ తాజాగా ఆమోదం తెలిపింది. 
 

మరిన్ని వార్తలు