Jio : టార్గెట్‌ ఓటీటీ యూజర్స్‌... 1095 జీబీ డేటా ప్లాన్‌

29 Jun, 2021 14:55 IST|Sakshi

ఓటీటీ యూజర్స్‌ టార్గెట్‌గా చేసుకుని సరికొత్త డేటాప్లాన్‌ని ప్రవేశపెట్టింది జియో నెట్‌వర్క్‌. డెయిలీ 3 జీబీ డేటాతో ఏడాది గడువుతో కొత్త ప్లాన్‌ను సైలెంట్‌గా ప్రకటించింది. ఇప్పటి వరకు జియో ఆఫర్‌ చేస్తున్న డేటా ప్యాకేజీల్లో ఇదే అత్యంత ఖరీదైనది.

ప్రస్తుతం 
జియో ప్రస్తుతం డెయిలీ 3 జీబీ డేటాతో రూ. 349, రూ. 401, రూ. 999లతో మూడు ప్లాన్లను అమలు చేస్తోంది. అయితే వీటితో వ్యాలిడిటీ గడువు తక్కువ. రూ. 999 ప్లాన్‌లో సైతం వ్యాలిడిలీ 85 రోజులే వస్తోంది. దీంతో పదే పదే రీఛార్జీ చేసుకోవాల్సి వస్తుంది. మొబైల్‌లో వీడియో కంటెంట్‌, ఓటీటీలపై ఎక్కువగా గడిపే తరుచుగా రీఛార్జీ ఇబ్బందులు తప్పించేందుకు ఈ కొత్త ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది.

రూ. 3,499 ప్లాన్‌
జియో కొత్తగా తెచ్చిన రూ. 3,499 ప్యాక్‌లో గడువు 365 రోజులు. రోజుకి 3 జీబీ డేటాను అందిస్తుంది. డేటా గడువు ముగిసిన తర్వాత నెట్‌ స్పీడ్‌ 64 కేబీపీఎస్‌కి పడిపోతుంది. రోజుకు వంద ఎస్‌ఎమ్మెస్‌లు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో డిస్నీ, హాట్‌స్టార్‌ వీఐపీ ప్యాకేజీని జియో తొలగించింది. కేవలం జియో అప్లికేషన్లనే ఉచితంగా అందిస్తోంది. 
 

చదవండి : నెట్‌ఫ్లిక్స్‌లో ఈ కొత్త ఫీచర్‌ ఏదో బాగుందే..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు