Jio: డేటా అయిపోయిందా? ఇలా చేస్తే రీఛార్జ్‌ చేయకుండానే 1 జీబీ పొందొచ్చు

3 Jul, 2021 11:47 IST|Sakshi

డేటా సమస్యకు సత్వర పరిష్కారం 

కొత్తగా ఎమర్జెన్సీ డేటా లోన్‌ ప్లాన్‌  

ముంబై : ఇంటర్నెట్‌ వాడకానికి సరికొత్త అర్థం చెప్పిన జియో నెట్‌వర్క్‌ మరో కొత్త ప్లాన్‌ ప్రకటించింది. రోజువారీ హై స్పీడ్‌ డేటా లిమిట్‌తో  ఎదురయ్యే ఇబ్బందులు తీర్చేలా ఎమర్జెన్సీ డేటా లోన్‌ ప్లాన్‌ ప్రకటిచింది. 

డేటా లోన్‌
చాలా మంది వినియోగదారులు తమ రోజువారీ డేటా కోటాను చాలా త్వరగా వినియోగించేస్తున్నారు. ఆ తర్వాత రోజంతా హై స్పీడ్‌ డేటా లేకుండా ఉండిపోతున్నారు. దీంతో ప్రతి వినియోగదారుడు వెంటనే 1 జీబీ డేటాను టాప్ అప్ చేసుకునేలా కొత్త ప్లాన్‌ అమల్లోకి తెచ్చింది. ఈ టాప్‌ అప్‌ డేటాకి  సంబంధించిన రీఛార్జ్‌ ఎమౌంట్‌ని తర్వాత పే చేయోచ్చు. ఒక్కో ప్యాక్‌ ధర రూ .11గా ఉంది. దీంతో 1 జీబీ డేటా అదనంగా వస్తుంది. ఈ సౌకర్యం ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో అందిస్తోంది.

ఎమర్జెన్సీ డేటాలోన్‌ పొందాలంటే
మై జియో యాప్‌లో మెనూలోకి వెళ్లాలి. అందులో మొబైల్‌ విభాగాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ ఎమర్జెన్సీ డేటా లోన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానే మొదట యాక్టివేట్‌ నౌ ఆ తర్వాత ప్రోసీడ్‌ అనే ఆప్షన్లు వస్తాయి. ఈ ప్రాసెస్‌ ఫాలో అయితే 1 జీబీ డేటా అప్పటికప్పుడు లభిస్తుంది. మొత్తం ఐదు సార్లు ఇలా డేటా లోన్‌  తీసుకోవచ్చు. 

చదవండి : Airtel: కస్టమర్లకు నచ్చినట్టుగా ప్లాన్స్‌

మరిన్ని వార్తలు