జియో మార్ట్‌తో విప్లవాత్మక మార్పులు - ఇషా అంబానీ

15 Dec, 2021 14:15 IST|Sakshi

మెటా జియోమార్ట్‌ చేతులు కలపడం వల్ల దేశీయంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని జియో ప్లాట్‌ఫార్మ్‌ డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాశ్‌ అంబానీ అభిప్రాయపడ్డారు. మెటా ఛీప్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మార్నె లెవినేతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో వారు అనేక విషయాలను చర్చించారు. 

భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ‘కిరాణా దుకాణాలు’ వెన్నెముక అని ఇషా అంబానీ అన్నారు. దేశంలో 40 కోట్ల మందికి వాట్సాప్‌ ద్వారా జియోమార్ట్‌ను అందుబాటులోకి వస్తుందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కొనుగోళ్ల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. జియో రాకతో  ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిందని .. ఇది కంపెనీగా జియోకి కస్టమర్లకి ఎంతో ఉపయోగపడిందన్నారు. అదే పద్దతిలో జియోమార్ట్‌ వల్ల వినియోగదారులకు కొనుగులు ప్రక్రియ ఎంతో సులభం అవుతుందన్నారు. వాట్సాప్‌లో మేసేజ్‌ చేస్తే చాలు పాలు, బిస్కట్‌, కూరగాయలు అన్ని ఇంటికే వస్తాయన్నారు. అంతేకాదు చెల్లింపులు సైతం వాట్సాప్‌ నుంచి చేయోచ్చన్నారు. 

మరిన్ని వార్తలు