దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు!

29 Nov, 2022 11:43 IST|Sakshi

ప్రముఖ టెలికం దిగ్గజం జియోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా జియో నెట్‌ వర్క్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇన్‌ కమింగ్‌ కాల్స్‌, అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ వెళ్లడం లేదని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని జియోను కోరుతూ ట్వీట్‌లు పెడుతున్నారు. 

ఈ తరుణంలో ఆన్‌లైన్‌ సర్వీసుల్లోని లోపాల్ని గుర్తించే డౌన్‌ డిటెక్టర్‌ సంస్థ..ఇప్పటి వరకు, 600కు పైగా ఫిర్యాదుల్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, నెట్‌వర్క్‌ సమస్యల్ని ఎదుర్కొంటున్న వినియోగదారులు తక్కువ మంది ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. డౌన్‌డిటెక్టర్‌లోని అవుట్‌టేజ్ మ్యాప్ మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్‌లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని సమాచారం. 

కాగా, అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం లేని ఈ సమయంలో.. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు ఇంటర్నెట్ బాగా పనిచేస్తోందని యూజర్లు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తలెత్తిన ఈ లోపాన్ని సరి చేసేందుకు జియో ప్రతినిధులు నిమగ్నమయ్యారు. 

మరిన్ని వార్తలు