జియో స్పెషల్‌ ఆఫర్‌... ఈ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌

28 Sep, 2021 13:21 IST|Sakshi

మొబైల్‌ ఇంటర్నెట్‌ యూసేజీలో విప్లవాత్మక మార్పలకు కారణమైన జియో సంస్థ తన వినియోగదారులకు మరో ఆఫర్‌ ప్రకటించింది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని పలు రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని ప్రకటించింది.

రియలన్స్‌ జియోకి సంబంధించి మోస్ట్‌ పాపులర్‌ ప్లాన్స్‌గా ఉన్న రూ. 249, రూ.555, రూ. 599లపై జియో 20 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌ పొందాలంటే మైజియో యాప్‌ నుంచే రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రీఛార్జీ పూర్తయిన వెంటనే క్యాష్‌బ్యాక్‌ అమౌంట్‌ ఖాతాలో జమ అవుతాయి. వీటిని తదుపరి రీఛార్జ్‌ సమయంలో ఉపయోగించుకోవచ్చు. 
చదవండి : చైనా ఫోన్‌లు కనిపిస్తే విసిరి కొట్టండి, ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ

మరిన్ని వార్తలు