Reliance Jio: జియో యూజర్లకు రెండు రోజులు ఉచితంగా కాల్స్, డేటా!

8 Feb, 2022 18:13 IST|Sakshi

ముంబై: ఫిబ్రవరి 5న రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ ఒక్కసారిగా డౌన్‌ అయిన సంగతి తెలిసిందే. ముంబై, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రాంతాలలో రిలయన్స్‌ జియో సేవలలో డౌన్ కావడంతో చాలామంది రిలయన్స్ జియో వినియోగదారులు గత వారం కాల్స్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. కాల్స్ చేసేటప్పుడు "మీరు నెట్ వర్క్ లో రిజిస్టర్ కాలేదు" అనే సందేశాన్ని వచ్చినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఆ అసౌకర్యానికి చింతిస్తూ రిలయన్స్ జియో ఇప్పుడు ప్రభావిత వినియోగదారులకు రెండు రోజుల ఉచిత కాలింగ్, డేటా సేవలను అందిస్తుంది.

ముఖ్యంగా, రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని రెండు రోజులు పొడీగిస్తున్నట్లు పేర్కొంది. గత వారం నెట్ వర్క్ అంతరాయం వల్ల ప్రభావితమైన కస్టమర్ల పోస్ట్ పెయిడ్ ఖాతాదారుల  రెండు రోజుల వాలిడిటీ కూడా రెండు రోజులు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే, ఇది కేవలం జియో నెట్‌వర్క్‌ వల్ల అసౌకర్యానికి గురైన వారికి మాత్రమే అని తెలియజేసింది. ఈ విషయాన్ని జియో తన వినియోగదారులకు ఒక సందేశం రూపంలో పంపుతుంది. పంపుతోంది. ఫిబ్రవరి 5న ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని సర్కిల్స్‌లోనూ ఇదే తరహా సమస్యలు యూజర్లు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరికొన్ని చోట్ల నాలుగైదు రోజుల నుంచి నెట్‌వర్క్‌ సరిగా పని చేయడం లేదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. జియో నుంచి మాత్రమే కాదు.. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో నెంబర్లకు కాల్స్‌ కనెక్ట్‌ కావడం లేదనే ఫిర్యాదు అందాయి.

(చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు.. వడ్డీ రేటు పెరిగే అవకాశం..!)

మరిన్ని వార్తలు