Reliance AGM 2021: రిలయన్స్ జియో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?

24 Jun, 2021 16:34 IST|Sakshi

ముంబై: రిలయన్స్ తన 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో 5జీ గురించి ప్రకటించింది. టెక్ దిగ్గజం గూగుల్ సహకారంతో తన కొత్త ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను అభివృద్ది చేసినట్లు తెలిపింది. జియో 5జీ కోసం రిలయన్స్ గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ భాగస్వాముల సహకారం తీసుకున్నట్లు ప్రకటించింది. జియో 5జీ గూగుల్ సంస్థ క్లౌడ్ స్టోరేజ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొనున్నట్లు ఈ సమావేశంలో తెలిపింది. మైక్రోసాఫ్ట్ సహకారంతో 10 ఎండబ్ల్యూ సామర్ధ్యం గల జియో-అజ్యూరే క్లౌడ్ డేటా సెంటర్లు నిర్మించినట్లు కూడా ఉదహరించింది.

అంబానీ నేతృత్వంలోని సంస్థ జియో 5జి టెక్నాలజీని పరీక్షించినట్లు తెలిపింది. టెస్టింగ్ సమయంలో 1జీబీపీఎస్ వేగాన్ని తకినట్లు పేర్కొంది. దేశంలోనే పూర్తి స్థాయి 5జీ సేవలను ప్రారంభించిన మొదటి నెట్ వర్క్ రిలయన్స్ జియోనే సంస్థ ప్రకటించింది. 5జీ పరికరాల అభివృద్ధి కోసం ప్రపంచ భాగస్వాముల సహకారం తీసుకున్నట్లు తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వినోదం, రిటైల్ రంగాలలో పెనుమార్పులు సంభవిస్తాయని వివరించింది. రిలయన్స్ ఫౌండేషన్ పాఠశాలల్లోని విద్యార్థులకు జియో 5జీ సహాయంతో ఎఆర్/విఆర్ కంటెంట్‌ను అందించనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. జియో ఫైబర్ డేటా వినియోగం ఒక సంవత్సరం క్రితం తో పోలిస్తే 3.5 రెట్లు పెరిగింది. జియో ఫైబర్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయని అంబానీ అన్నారు.

చదవండి: ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' లాంచ్ చేసిన జియో

>
మరిన్ని వార్తలు