Jio Smart Phone: జియో స్మార్ట్‌ఫోన్‌ ప్రీ బుకింగ్స్‌ ఎప్పుడంటే?

27 Aug, 2021 14:04 IST|Sakshi

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్‌ 10న ముఖేష్ అంబానీ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు.  ఈ ఫోన్‌ కొనేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్‌కి సంబంధించి డిమాండ్‌ ఆకాశాన్ని తాకుతోంది. దీంతో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఫోన్‌కి ఈ ఫోన్‌కి ప్రీ బుకింగ్స్‌ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.  ఈ మేరకు వచ్చే వారం నుంచి  ప్రీ బుకింగ్స్‌  ప్రారంభం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ఆరోజు చెప్పిన ముఖేష్‌
జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.  ఈఫోన్‌ ఫీచర్లు, కాస్ట్‌ ఎంత అనే అంశాలపై ఇప్పటికే సోషల్‌ మీడియా హోరెత్తిపోతుంది. కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నట్లు ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకోని వస్తున్నట్లు మొబైల్‌మార్కెట్‌ ఎక్స్‌ప‌ర్ట్స్‌ దృవీకరించారు.

ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి
5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్, 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.  

జియో మార్కెట్‌ 
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) ఏప్రిల్‌-2021 లెక్కల ప్రకారం.. మే 2021 నాటికి జియో యూజర్లు 431,23 మిలియన్ల  యూజర్లతో ప్రథమస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో 189.49 మిలియన్లతో ఎయిర్‌ టెల్‌ , 119.63 మిలియన్లతో వొడాఫోన్‌ - ఐడియా, 16.44 మిలియన్‌ యూజర్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. అయితే టెలికాం రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న జియో యూజర్లను పెంచేందుకు ప్లాన్‌ చేస్తుంది. దీంతో రూరల్‌ ఇండియాని టార్గెట్‌ చేస్తూ గూగుల్‌తో కలిసి ఈ జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్‌ లో విడుదల చేయనుంది. 

>
మరిన్ని వార్తలు