చౌక ధరలో జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ 

19 Oct, 2020 08:08 IST|Sakshi

ధర రూ.2,500–3,000 మధ్యలో 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన జియో... అతి తక్కువ ధరకే ఈ ఫోన్లను కస్టమర్లకు అందించాలని భావిస్తోంది. కంపెనీ అధికారుల సమాచారం మేరకు... 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.5వేల లోపే ఉంటుందని, క్రమంగా ఈ ధరను రూ.2,500–3,000 స్థాయికి తగ్గించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో 2జీ కనెక్షన్లను వినియోగిస్తున్న 20 నుంచి 30 కోట్ల వినియోగదారుల లక్ష్యంగా ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ల తయారీని జియో చేపట్టి్టంది. ప్రస్తుతం భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.27000లుగా ఉంది. భారత్‌ను 2జీ ఫ్రీ దేశంగా తీర్చేదిద్దడమే తమ లక్ష్యమని రిలయన్స్‌  చైర్మన్‌ ముకేశ్‌ కంపెనీ ఇటీవల జరిగిన 43వ వార్షికోత్సవంలో ఉద్ఘాటించిన సంగతి తెలిసిందే.  చదవండి: (రెడ్‌మీ తొలి 5జీ స్మార్ట్ ఫోన్ వస్తోంది..)

పాలసీ రేట్ల బదిలీకి ఎన్‌పీఏలు ఆటంకం 

  • ఆర్‌బీఐ అధికారుల చర్చా పత్రం వెల్లడి 

ముంబై: ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు విధానపరమైన చర్యలను ప్రకటిస్తుండగా.. వీటి బదిలీకి బ్యాంకుల్లో అధిక మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) ఆటంకంగా మారినట్టు ఆర్‌బీఐ అధికారులు రూపొందించిన డాక్యుమెంట్‌ వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి నిధులు జొప్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

డిజిటల్‌ మీడియాలో 26 % ఎఫ్‌డీఐ పరిమితి
న్యూఢిల్లీ: డిజిటల్‌ మీడియా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితులపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో కేంద్రం స్పష్టతనిచ్చింది. న్యూస్‌ అగ్రిగేటర్లు, డిజిటల్‌ మీడియా సంస్థలకు సమాచారం సరఫరా చేసే న్యూస్‌ ఏజెన్సీలు, వెబ్‌సైట్లలో న్యూస్‌.. కరెంట్‌ అఫైర్స్‌ మొదలైనవి అప్‌లోడ్‌ చేసే సంస్థలకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఈ వివరణ ఇచ్చిన తేదీ నుంచి ఏడాది వ్యవధిలోగా 26 శాతం ఎఫ్‌డీఐ పరిమితులకు అనుగుణంగా ఆయా సంస్థలు సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.  ఈ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత.. పెట్టుబడులను సమీకరించిన సంస్థలపైనే ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ అనుమతులతో ప్రింట్‌ మీడియా తరహాలోనే డిజిటల్‌ మీడియాలో కూడా ఎఫ్‌డీఐలపై పరిమితులను విధిస్తూ కేంద్రం గతేడాది ఆగస్టులో నిర్ణయం     తీసుకుంది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా