1జీబీ స్పీడ్‌తో దూకుడు : జియో, క్వాల్‌కామ్‌ జట్టు

21 Oct, 2020 08:01 IST|Sakshi

 5జీ ట్రయల్స్ ప్రారంభం, 1 జీబీపీఎస్‌ పైగా వేగం

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెక్నాలజీ మొబైల్‌ నెట్‌వర్క్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రిలయన్స్‌ జియో, క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ వెల్లడించాయి. క్వాల్‌కామ్‌ 5జీ ఆర్‌ఏఎన్‌ ప్లాట్‌ఫాంపై రిలయన్స్ జియో 5జీఎన్ఆర్‌ సొల్యూషన్ తో 1 జీబీపీఎస్‌ పైగా స్పీడ్‌ను సాధించగలిగినట్లు తెలిపాయి. మరింత వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్‌కు 5జీ టెక్నాలజీ తోడ్పడుతుంది. దేశీ అవసరాలకు అవసరమైన 5జీ సొల్యూషన్స్, నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు జియోవెల్లడించింది. స్థానికంగా తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, ఆత్మనిర్భర భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌ ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ తెలిపారు. క్వాల్కమ్ టెక్నాలజీస్, 4జీ /5జీ  సీనియర్ వైస్ ప్రెసిడెంట్  జనరల్ మేనేజర్ దుర్గా మల్లాడి కూడా సంతోషం వ్యక్తం చేశారు.

[ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ టిప్‌తో సేఫ్‌గా ఉండండి ]

మరిన్ని వార్తలు