4జీ స్పీడ్‌లో రికార్డు సృష్టించిన జియో..!

16 Jun, 2021 18:22 IST|Sakshi

న్యూ ఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో మరోసారి సత్తా చాటింది. 4జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ విషయంలో జియోకు సాటిలేదని మరోసారి రుజువైంది. మే నెలలో డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ విషయంలో ఇతర నెట్‌వర్క్‌లకంటే సెకనుకు సరాసరి 20.7 ఎమ్‌బీపీఎస్‌ స్పీడ్‌తో జియో నెట్‌వర్క్‌  ముందంజలో ఉంది. కాగా ఈ విషయాన్ని టెలికాం రెగ్యూలేటర్‌ ట్రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతోపాటుగా వోడాఫోన్‌ అప్‌లోడింగ్‌ స్పీడ్‌లో ముందంజలో నిలిచింది. వోడాఫోన్‌ సుమారు 6.7 ఎమ్‌బీపీఎస్‌ అప్‌లోడింగ్‌ స్పీడ్‌ను కలిగి ఉంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జూన్ 8 న ప్రచురించిన గణాంకాల ప్రకారం.. వోడాఫోన్-ఐడియా మే నెలలో సగటున 6.3 ఎమ్‌బిపిఎస్ అప్‌లోడ్ వేగాన్ని కలిగి ఉండగా, దీని తరువాత రిలయన్స్ జియో 4.2 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో, భారతి ఎయిర్‌టెల్ 3.6 ఎమ్‌బీపీఎస్‌ అప్‌లోడింగ్‌ వేగాన్ని కల్గి ఉన్నట్లు ట్రాయ్‌ పేర్కొంది. ​కాగా తాజాగా రిలయన్స్‌ జియో 4జీ నెట్‌వర్క్‌ స్పీడ్‌ స్వల్పంగా పెరగ్గా, ఇది వోడాఫోన్‌-ఐడియాతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువ.

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంచుకున్న ప్రాంతాల్లోనే 4జీ సేవలను ప్రారంభించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ స్పీడ్‌ను ట్రాయ్‌ తన నివేదికలో తెలుపకపోవడం గమనార్హం. దేశ వ్యాప్తంగా రియల్‌ టైమ్‌ ప్రాతిపదికన నెట్‌వర్క్‌ స్పీడ్‌ను  మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో ట్రాయ్ లెక్కిస్తుంది.

చదవండి: జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్‌ లేకుండానే..

మరిన్ని వార్తలు