‘జియో నెక్ట్స్‌’ లాంఛింగ్‌ వాయిదా! మార్కెట్‌లోకి వచ్చేది అప్పుడే?

10 Sep, 2021 12:16 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో నెక్ట్స్‌ లాంఛింగ్‌ వాయిదా పడింది. రిలయన్స్‌ వార్షిక సమావేశంలో వినాయక చవికి తమ ఫోన్‌ను లాంఛ్‌ చేస్తామని ఆ కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు. 

దీపావళికి
అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు అందించే ఫోన్‌గా జియో నెక్ట్స్‌ గురించి ప్రచారం జరిగింది. టెక్‌ దిగ్గజం గూగుల్‌, ఇంటర్నెట్‌ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో సంస్థల భాగస్వామ్యంలో వస్తోన్న తొలి ఫోన్‌గా దీనికి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. సెప్టెంబరు 10న వచ్చే వినాయక చవితిన ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపారు. అయితే ఈ ఫోన్‌ విడుదలని దీపావళికి వాయిదా వేశాయి గూగుల్‌ , జియో సంస్థలు.

మరింత ఆకర్షణీయంగా
గూగుల్‌ అందిస్తోన్న అనేక అధునాత ఫీచర్లను జియో నెక్ట్స్‌ ఫోన్‌లో పొందు పరిచారు. ఇప్పటికే ఈ ఫోన్‌ పనితీరురు పరిశీలిస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో చిప్‌సెట్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో సెప్టెంబరు 10 మార్కెట్‌లోకి తేవడం కంటే కొంత సమయం తీసుకుని దీపావళికి రిలీజ్‌ చేయడం బెటర్‌ అని రెండు కంపెనీలు భావించాయి. దీంతో లాంఛింగ్‌కి ఒక రోజు ముందే వాయిదా నిర్ణయాన్ని ప్రకటించాయి.

ఎదురు చూపులు
జులైలో రిలయన్స్‌ వార్షిక సమావేశం జరిగినప్పటి నుంచి నెక్ట్స్‌ ఫోన్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనీసం పది కోట్ల మందికి నెక్ట్స్‌ ఫోన్‌ను అందివ్వడం తమ లక్క్ష్యమని ముఖేశ్‌ అంబాని ప్రకటించారు. అందుకు తగ్గట్టే కేవలం రూ.500 చెల్లిస్తే చాలు మిగిలిన సొమ్ము ఈఎంఐలో చెల్లించండి అంటూ అనేక ఆర్థిక సంస్థలు ఫైనాన్స్‌ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇక ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఫోన్‌ లాంఛింగ్‌ వాయిదా పడింది.  

చదవండి : Realme: ఫెస్టివల్‌ సీజన్‌.. టార్గెట్‌ బిగ్‌సేల్స్‌!

మరిన్ని వార్తలు