Jio Phone Next: రిలయన్స్ జియోఫోన్‌ అమ్మకాలు ప్రారంభం, ఎలా కొనాలో తెలుసా..?

7 Nov, 2021 13:21 IST|Sakshi

జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఫోన్‌ కొనుగోలు కోసం స్టోర్ కు వెళ్లేముందే వాట్సాప్, లేదంటే కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next)లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనే సౌకర్యం లేదని జియో ప్రతినిధులు తెలిపారు.   

రిజిస్ట్రేషన్‌ పక్కా 
జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు కోసం ముందుగా 70182 70182కు హాయ్‌ మెసేజ్‌ పెట్టాలి. అనంతరం అదే నెంబర్‌ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా వినియోగదారులు తమ లొకేషన్ ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్‌ పూర్తయిన తర్వాత స్టోర్కు వెళ్లి జియో ఫోన్ నెక్ట్స్ కొనుక్కోవచ్చంటూ వినియోగదారులకు మెసేజ్‌ వెళుతుంది. అలా మెసేజ్‌ వస్తే స్టోర్‌లో జియో ఫోన్‌నెక్ట్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ ధరల విషయానికొస్తే ఫోన్‌ ధర రూ.6,499 ఉండగా.. ఫోన్‌ కొనుగోలు కోసం ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. డౌన్‌ పేమెంట్‌ కింద రూ.1,999, రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

30వేల ఔట్‌లెట్‌లు
జియో ఫోన్ కొనుగోలు కోసం రిలయన్స్‌ దేశ వ్యాప్తంగా 30,000కు పైగా రిటైల్ అవుట్ లెట్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా కొనుగోలు దారులు ఈ ఫోన్‌ను ఔట్‌లెట్లలో సొంతం చేసుకోవచ్చు.

 

జియో ఫోన్‌ నెక్ట్స్‌ ఫీచర్లు  

♦ డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ రిజెల్యూషన్ (720 X 1440 )

♦ స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్‌ ప్రింట్ కోటింగ్

♦ ప్రాసెసర్‌:  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్‌

♦ ర్యామ్‌,స్టోరేజ్‌ : 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ 512 జీబీ వరకు

♦ బ్యాక్‌ కెమెరా: 13 ఎంపీ

♦ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ

♦ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్‌

♦ సిమ్‌ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్)

♦ సిమ్‌ పరిమాణం: నానో

♦ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్‌బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం

♦ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్

చదవండి: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్‌ మీ సొంతం..! ఫోన్‌ ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు