ఎక్ఛేంజ్‌: జియో ఫోన్‌ నెక్ట్స్‌పై బంపరాఫర్‌!

18 May, 2022 21:32 IST|Sakshi

యూజర్లకు జియో బంపరాఫర్‌ ప్రకటించింది. ఎక్ఛ్సేంజ్‌ ఆఫర్‌పై జియో ఫోన్‌ నెక్ట్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ పరిమిత కాల ఎక్ఛ్సేంజ్‌ ఆఫర్‌లో  కొనుగోలు దారులు రూ.4,499తో జియో ఫోన్‌ నెక్ట్స్‌ పొందవచ్చు. 

అయితే ఈ ఆఫర్‌లో కొనుగోలు దారులు 4జీ ఫీచర్‌ఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఎక్ఛేంజ్‌ చేసుకొని జియో ఫోన్‌ నెక్ట్స్‌ను సొంతం చేసుకోవచ్చని జియో ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ వద్దనుకుంటే రూ.6,499కే జియో ఫోన్‌ నెక్ట్స్‌ కొనుగోలు చేయోచ్చని  జియో సంస్థ వెల్లడించింది. 

జియో ఫోన్‌ నెక్ట్స్‌ ఫీచర్లు  

డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ రిజెల్యూషన్ (720 X 1440 )

స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్‌ ప్రింట్ కోటింగ్

ప్రాసెసర్‌:  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్‌

ర్యామ్‌,స్టోరేజ్‌ : 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ 512 జీబీ వరకు

బ్యాక్‌ కెమెరా: 13 ఎంపీ

ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ

బ్యాటరీ: 3500 ఎంఏహెచ్‌

సిమ్‌ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్)

సిమ్‌ పరిమాణం: నానో

కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్‌బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం

సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్

అంతేకాదు ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్‌ ను గూగుల్‌ డెవలప్‌ చేసింది. జియో ఫోన్‌ నెక్ట్స్‌ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ పెద్దగా చదవడం, ట్రాన్స్‌లేట్‌ చేసుకునేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. జియో ఫోన్‌ నెక్ట్స్‌ మై జియో, జియో సినిమా,జియో టీవీ, జియో సావన్‌తో పాటు మరికొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకునే సదుపాయం ఉంది. 
 

మరిన్ని వార్తలు