Jio Phone Next :పెరగనున్న 'జియో నెక్ట్స్‌' ఫోన్‌ ధరలు?

16 Sep, 2021 09:44 IST|Sakshi

సెమీ కండక్టర్ల కొరత రిలయన్స్‌ జియోకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుందా? ప్రపంచంలో అత్యంత చవకైన 'జియో నెక్ట్స్‌' ఫోన్‌ ధర మరింత పెరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంచనా ప్రకారం..ఈ ఫోన్‌ ధర రూ.5వేలు ఉండగా.. ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన సెమీకండక్టర్ ధర పెరగడంతో..ఆ ప్రభావం జియో నెక్ట్స్‌ ధరపై పడనున్నట్లు తెలుస్తోంది. 

గూగుల్‌-జియో ఆధ్వర్యంలో వినాయక చవితికి విడుదల కావాల్సిన జియో ఫోన్‌..దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఫోన్‌ విడుదల వాయిదా వేయడంతో ధర మరింత పెరగనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటి టెలికామ్‌ రిపోర్ట్‌ ప్రకారం..ఫోన్‌లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా  వివిధ భాగాలు  ( కాంపోనెంట్స్‌) ధర సుమారు 20శాతం పెరిగింది. పెరిగిన ధరతో సెమీకండక్టర్ల లభ్యత లోటు 8 నుండి 20 వారాల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్‌ ధరలతో జియో ఫోన్‌ పై ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న ధరకే వచ్చే అవకాశం లేదని అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.     

దీంతో దిపావళికి జియో ఫోన్‌ విడుదలైనా విస్తృతంగా కాకుండా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండన్నుట్లు తెలుస్తోంది.కాగా,ధర పెరుగుదల, పూర్తి స్థాయిలో ఫోన్‌ అందుబాటులోకి తెస్తుందా? లేదంటే పరిమిత సంఖ్యలోనే విడుదల చేస్తుందా' అన్న ప్రచారంపై జియో స్పందించాల్సి ఉంది. 

చదవండి : జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్‌ ఫోన్‌ 

మరిన్ని వార్తలు