Jiophone Next : జియో ఫోన్‌పై మరో రూమర్‌, ధర ఇంత తక్కువా?!

15 Oct, 2021 12:13 IST|Sakshi

బడ్జెట్‌ ఫోన్‌ 'జియోనెక్ట్స్‌'పై మరోసారి సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే జియో ఫోన్‌ వినాయక చవితికి విడుదల కావాల్సి ఉండగా..సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్‌ ధర ఎంత ఉంటుంది? పెరిగిన ఫోన్‌ కాంపోనెట్స్‌ ధరల కారణంగా..గతంలో అనౌన్స్‌ చేసిన ధరకే వస్తుందా? లేదంటే ప్రైస్‌ తగ్గుతుందా? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే' విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. 

జియో ఫోన్‌ పై రూమర్స్‌ 
జియో - గూగుల్‌ భాగస్వామ‍్యంలో అతి తక్కువ ధరకే  విడుదల కానున్న ఆండ్రాయిడ్‌ ఫోన్‌పై మరోసారి కొన్ని రూమర్స్‌ వెలుగులోకి వచ్చాయి. గతంలో (సెప్టెంబర్‌ 10 రిపోర్ట్‌ ప్రకారం) ఈ ఫోన్‌ ధర రూ.5వేలని ప్రచారం జరిగింది. ఈటి టెలికామ్‌ రిపోర్ట్‌ ప్రకారం..ఫోన్‌లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా  వివిధ భాగాలు ( కాంపోనెంట్స్‌) ధర సుమారు 20శాతం పెరిగాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్‌ ధరలతో జియో ఫోన్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని, రూ.5వేలకే వచ్చే అవకాశం లేదని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజా రూమర్స్‌తో ఫోన్‌ ధర రూ.3,499కే లభించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ  ఇదే నిజమైతే తొలిసారి భారతీయలు అతితక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే అవకాశం లభించినట్లవుతుందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైరల్‌ అవుతున్న రూమర్స్‌ సంగతి ఎలా ఉన్నా..ఈ ఫోన్‌ ధర ఎంత అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంది.

ఫీచర‍్లు ఎలా ఉండబోతున్నాయ్‌
కాంపాక్ట్‌ డిస్‌ప్లేతో రానున్న ఈ ఫోన్‌ 5.5 అంగుళాలు ఉండనుంది. క్వాల్కమ్‌ క్యూఎం 215 చిప్‌ సెట్‌, ఆండ్రాయిడ్‌ 11 గో ఎడిషన్‌, 2500ఎంఏహెచ్‌ బ్యాటరీ, 2జీబీ అండ్ 3జీబీ ర్యామ్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. సింగిల్‌​ రేర్‌ కెమెరా, స్నాప్‌ చాట్‌ లెన్సెస్‌, వాయిస్‌ కమాండ్‌ కోసం గూగుల్‌ అసిస్టెంట్స్‌, గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌,ఇతర ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

మరిన్ని వార్తలు