భారత్‌లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్‌ విషయాలు!

16 Nov, 2022 13:12 IST|Sakshi

భారతదేశంలో ఉద్యోగార్థుల అవసరాలు, ప్రాధాన్యతలపై ప్రముఖ సంస్థ లింక్డ్‌ఇన్ అధ్యయనం (Linkedin Research) చేసింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. నివేదికలో.. వృత్తి పరమైన నైపుణ్యాల్ని పెంపు(Upskilling), పని- పర్సనల్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌, ప్రమోషన్స్.. లాంటి వాటిని ఉద్యోగులు కోరుకుంటున్నారు.

చాలా రంగాలలోని ఉద్యోగులు అధిక ప్రాధాన్యతల గురించి మాట్లాడుతూ.. వారి కెరీర్‌లో అభివృద్ధి, ఉద్యోగాలలో మార్పు అవసరమని పేర్కొంది. 2 లేదా మూడు సంవత్సరాల పాటు ఒకే రోల్‌ ఉంటున్న వారితో పోల్చితే, ప్రమోషన్‌ వచ్చిన వారు అదే సంస్థలో కొనసాగే అవకాశం 10 శాతం ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా నైపుణ్యాల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలను అనుకుంటున్నారు. ఎందుకంటే 2015 తర్వాత  దేశంలో ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్‌ విషయంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ మార్పులు సుమారు 29 శాతం మేర ఉండగా, 2025 నాటికి 50శాతం వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కంపెనీలు ఉద్యోగుల అనుభవం కంటే పని తీరు, టాలెంట్‌లు ఉన్నవారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారట.

ప్ర​స్తుతం భారత్‌లో (51%) యజమానులు.. ఉద్యోగుల సహకారాన్ని, నాలెడ్జ్‌ షేరింగ్‌ని ప్రోత్సహిస్తున్నారని తెలిపింది. ఉద్యోగులు తమ తోటి సిబ్బందితో సత్సంధాలను ఏర్పరచుకుంటున్నారు. ఇది వారి టీమ్స్‌ బలోపేతం చేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని, తద్వారా కంపెనీ కూడా కలిసొచ్చే అంశంగా మారుతుంతని నివేదిక చెప్తోంది.

చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి 

మరిన్ని వార్తలు