50,000 మందికి ఏసీలపై శిక్షణ: జాన్సన్‌ హిటాచీ

15 Jul, 2021 11:04 IST|Sakshi

న్యూఢిల్లీ: జాన్సన్‌ కంట్రోల్స్‌ హిటాచీ ఎయిర్‌ కండీషనింగ్‌ ఇండియా 2025 నాటికి 50 వేల మందిని ప్రపంచస్థాయి ఏసీ టెక్నీషియన్లుగా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, గుజరాత్‌లోని ఒక కేంద్రంలో యువతకు శిక్షణ ఇస్తామని ప్రకటించింది. భారత్‌లో వచ్చే 20 ఏళ్లలో ఏసీలకు డిమాండ్‌ ఎనిమిది రెట్లు పెరుగుతుందని పేర్కొంది. దేశంలో సుమారు రెండు లక్షల మంది ఏసీ టెక్నీషియన్లు ఉన్నారని అంచనా.   
 

మరిన్ని వార్తలు