Joker Virus: బీ అలర్ట్‌..! ఈ యాప్‌లు డిలీట్‌ చేసి ‘జోకర్‌’ని తరిమేయండి

19 Jun, 2021 20:24 IST|Sakshi

జోకర్‌ మాల్‌వేర్‌ మళ్లీ వచ్చేసింది. ఈ మాల్‌వేర్‌ ఒక్కసారి మన ఫోన్‌లోకి వచ్చిదంటే అంతే సంగతులు..! మీ ఫోన్లో నిక్షిప్తమైన విలువైన సమాచారాన్ని హకర్లు డార్క్‌ వెబ్‌లో అమ్మేస్తారు. అంతేకాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు. జోకర్‌ మాల్‌వేర్‌ తొలిసారిగా 2017 గూగుల్‌ ప్లేస్టోర్‌లో తొలిసారిగా ప్రత్యక్షమైంది.

దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్‌ యూజర్స్‌ జోకర్‌ మాల్‌వేర్‌తో లింకులు ఉన్న యాప్స్‌ (సురక్షితం కానీ) ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. తాజాగా సైబర్‌ సెక్యూరిటీ ఫ్రిమ్‌ క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ జోకర్‌ వైరస్‌ మాల్‌వేర్‌ ఉన్న ఎనిమిది యాప్‌లను గుర్తించింది. వీటిని వెంటనే ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్ల నుంచి ఆన్‌ఇన్‌స్టాల్‌ చేయమని సూచించింది.

జోకర్‌ మాల్‌వేర్‌కు గురైన యాప్స్‌ ఇవే...

1. ఆక్జిలారీ మెస్‌జ్‌ యాప్‌

2. ఫాస్ట్‌ మ్యాజిక్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌

3. ఫ్రీ క్యామ్‌ స్కానర్‌

4. సూపర్‌ మెసేజ్‌

5. ఏలిమేంట్‌ స్కానర్‌

6. గో మెసేజ్స్‌

7. ట్రావెల్‌ వాల్‌పేపర్‌

8. సూపర్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌

జోకర్‌ వైరస్‌ మాల్‌వేర్‌:
జోకర్‌ అనేది ఒక మొండి మాల్‌వేర్‌. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్‌ యూజర్‌పై యాడ్స్‌ రూపంలో ఈ మాల్‌వేర్‌ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, పేమెంట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్స్‌జాక్షన్‌ అయినట్లు యూజర్‌కు మెసేజ్‌ వచ్చినా..  అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్‌లను క్లిక్‌ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: ఆండ్రాయిడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్‌ సీఈవో..!

మరిన్ని వార్తలు