జోస్‌ ఆలుక్కాస్‌.. దీపావళి ఆఫర్లు

29 Oct, 2021 10:22 IST|Sakshi

ముంబై: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్‌ ఆలుక్కాస్‌ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు కొనేటప్పుడు వెండి నాణేలను ఉచితంగా పొందవచ్చు. వజ్రాభరణాలపై 25%, ప్లాటినం ఆభరణాలపై ఏడు శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రత్యేక యాంటిక్‌ చెవిపోగుల తరుగుపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు.

పాత బంగారు ఆభరణాలను అత్యాధునిక డిజైన్ల రూపంలోకి మార్పిడి చేసుకోవచ్చు. పండుగ రోజుల్లో ఆభరణాలను కొనుగోలు చేయాలనుకొనేవారికి ఇదొక గొప్ప అవకాశమని జోస్‌ ఆలుక్కాస్‌ యాజమాన్యం తెలిపింది. 
 

మరిన్ని వార్తలు