అదానీ షాక్‌! ట్విటర్‌లో ప్రముఖ జర్నలిస్ట్‌ పేరు ట్రెండింగ్‌..!

14 Jun, 2021 16:14 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లు మొదలైన కొన్ని గంటలకే సూచీలు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా అదానీ కంపెనీ షేర్లు సుమారు 25 శాతం మేర నష్టాన్ని చవిచూసాయి. అదానీ గ్రూప్స్‌కు నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌) షాక్‌ ఇవ్వడంతో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌డీఎల్‌ అదానీ కంపెనీలకు చెందిన సుమారు రూ. 43,500 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్‌ చేసింది. దీంతో అదానీ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 1,40,500.74 కోట్లకు పడిపోయింది.

అదానీ గ్రూప్స్‌ కంపెనీ షేర్లు భారీగా పతనమవ్వడానికి కారణం ప్రముఖ బిజినెస్‌ జర్నలిస్ట్‌ సుచేతా దలాల్‌ అంటూ ట్విటర్‌లో మారుమోగుతుంది. సుచేతా దలాల్‌ జూన్‌ 12న చేసిన ట్విట్‌ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌గా  మారింది. సుచేతా దలాల్‌ తన ట్విట్‌లో ‘ఓ కంపెనీకు చెందిన షేర్‌ వాల్యూను రిగ్గింగ్‌ చేస్తూ వస్తోంది. సెబి ట్రాకింగ్‌ సిస్టమ్‌లతో లభ్యమయ్యే సమాచారంతో.. ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించడం కష్టమని తెలిపింది.’ నెటిజన్లు ఈ ట్విట్‌ను రీట్విట్‌ చేస్తూ తెగ వైరల్‌ చేస్తున్నారు.

ట్విటర్‌లో ఓ నెటిజన్‌ తన ట్విట్‌లో ‘ ఎలన్‌ మస్క్‌ ఒక్క ట్విట్‌తో క్రిప్టోకరెన్సీ వాల్యూను పెంచగలదు.. కానీ సుచేతా దలాల్‌  కంపెనీ పేరు బయటకు చెప్పకుండానే చేసిన ట్విట్‌తో అదానీ కంపెనీ షేర్‌ విలువ భారీగా నష్టపోయింద’ని తెలిపాడు.  కాగా సుచేతా దలాల్‌ అంతకుముందు హర్షద్‌ మెహతా స్కామ్‌-1992 ను వెలుగులోకి తెచ్చింది. ఈ స్కామ్‌ అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది.

ఎన్‌ఎస్‌డీఎల్‌ అదానీ గ్రూప్‌కు చెందిన విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్న వార్తలను అదానీ ఖండించింది. ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించడానికే ఉద్ధేశపూర్వకంగా కుట్ర జరిగిందని వివరించింది.

చదవండి: ఎన్ఎస్‌డీఎల్: అదానీకి భారీ షాక్‌


 

మరిన్ని వార్తలు