హైస్పీడ్ ఈ-స్కూటర్ ‘మిహోస్’ లాంచ్‌..ఫ్రీ బుకింగ్‌, ధర ఎంతంటే?

20 Jan, 2023 19:37 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ  మార్కెట్లో మరో ఈ స్కూటర్ సందడి  చేయనుంది. జాయ్ ఇ-బైక్ తయారీదారు వార్డ్ విజార్డ్ తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్ ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. జనవరి 22 నుండి  కస్టమర్‌లు కంపెనీ వెబ్‌సైట్ నుండి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 600+ అధీకృత షోరూమ్‌ల నుండి మిహోస్‌ను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. మిహోస్ డెలివరీలు మార్చి 2023లో దశలవారీగా ప్రారంభం మవుతాయని కంపెనీ  ఒక ప్రకటన  విడుదల చేసింది. 

ఆటో ఎక్స్‌పో 2023 సందర్భంగా జాయ్ ఇ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియాలో మొదటి 5000 మంది కస్టమర్‌లకు) లాంచ్‌ చేసింది. స్మార్ట్ మిహోస్ ఇ-స్కూటర్ విభిన్న సెన్సార్ల కలయికతో వస్తుంది. అదనపు మన్నిక, సేఫ్టీకోసం పాలీడైసైక్లోపెంటాడిన్ (PDCPD)తో రూపొందించింది. 

7 సెకన్లలోపు వ్యవధిలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. నికెల్ మాంగనీస్ కోబాల్ట్ కెమిస్ట్రీతో 74V40Ah Li-Ion ఆధారిత బ్యాటరీ,యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, GPS సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్ , జియో-ఫెన్సింగ్ వంటి అనేక ఇతర ఫీచర్లు మిహోస్‌లో ఉన్నాయి.'జాయ్ ఇ-కనెక్ట్ యాప్' ద్వారా స్కూటర్‌ని ట్రాక్ చేయవచ్చు , బ్యాటరీ స్థితిని కూడా రిమోట్‌గా తనిఖీ చేయవచ్చు. రివర్స్ మోడ్‌తో  ఇరుకైన పార్కింగ్ ప్రదేశాల నుండి సులభంగా బయటకు రావడానికి స్కూటర్‌ను వెనుకకు తరలించడానికి అనుమతిస్తుంది. మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ, పెరల్ వైట్ ఇలా నాలుగు రంగుల్లో మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్  లభిస్తుంది.

ఆటో ఎక్స్‌పోలో తమకు అద్భుతమైన స్పందన లభించిందనీ, ముఖ్యంగా ఈ స్కూటర్‌ రెట్రో డిజైన్‌ను ప్రశంసించడమే కాకుండా అదనపు భద్రత కోసం  ఉపయోగించిన పాలీ డైసైక్లోపెంటాడిన్ బాగా ఆకర్షించిందనీ వార్డ్‌విజార్డ్ చైర్మన్ ,  మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తా తెలిపారు. 

వినియోగదారుల సానుకూల స్పందనతోనే ఆన్‌లైన్ బుకింగ్స్‌ను ఉచితంగా ప్రారంభించామన్నారు. టాప్‌ నాచ్‌టెక్నాలజీ,  ప్రీమియం ఫీచర్లతో, కస్టమర్ల ఆకాంక్షల్ని తీర్చగలమనే విశ్వాసాన్ని  ఆయన వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు