జోయాలుక్కాస్‌లో దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

20 Oct, 2022 10:39 IST|Sakshi

హైదరాబాద్‌: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్‌ దీపావళి సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్‌ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది.

అలాగే ఎస్‌బీఐ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 24 వరకు ఈ ఆఫర్‌ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్‌ తెలిపింది.
 

మరిన్ని వార్తలు