జోయాలుక్కాస్‌ గుడ్‌న్యూస్‌: 50 శాతం మేకింగ్‌ చార్జెస్‌ తగ్గింపు 

15 Mar, 2023 15:23 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్‌ ‘సంవత్సరపు సాటిలేని జ్యువెలరీ సేల్‌’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆభరణాల ముజూరీ చార్జీల (వీఏ)పై 50 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘‘ఈ మార్చి 26 వరకు అందుబాటులో ఉండే ఈ గొప్ప ఆఫర్‌తో ఇంతకు ముందు లేని విధంగా సాటిలేని జ్యువెలరీ అనుభవాన్ని ఆనందించవచ్చు’’ అని జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జాయ్‌ అలూక్కాస్‌ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఒక సంవత్సరం ఉచిత బీమా, జీవిత కాల ఉచిత నిర్వహణ, బై బ్యాక్‌ ఆఫర్లను పొందొచ్చని జోయాలుక్కాస్‌ తెలిపింది. 

ఇది  కూడా చదవండి: 250 కోట్ల బిగ్గెస్ట్‌ ప్రాపర్టీ డీల్‌: మాజీ ఛాంపియన్‌, బజాజ్‌ ఆటో చైర్మన్‌ రికార్డు

రిలయన్స్‌ ‘మెట్రో’ డీల్‌ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు

మరిన్ని వార్తలు