ఫైనాన్స్‌ వ్యాపారంలోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌

24 Oct, 2022 06:31 IST|Sakshi

ముంబై: సజ్జన్‌ జిందాల్‌ సారథ్యంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ తాజాగా రుణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఈ–కామర్స్‌ విభాగమైన జేఎస్‌డబ్ల్యూ వన్‌ ప్లాట్‌ఫామ్స్‌ (జేఎస్‌డబ్ల్యూవోపీ) కింద గ్రూప్‌లోని సంస్థల అవసరాల కోసం జేఎస్‌డబ్ల్యూ వన్‌ ఫైనాన్స్‌ పేరిట నాన్‌–బ్యాంక్‌ ఫైనాన్స్‌ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ని ఏర్పాటు చేస్తోంది. అందులో రెండేళ్ల వ్యవధిలో రూ. 350– రూ. 400 కోట్ల వరకూ ఇన్వెస్ట్‌ చేస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో లైసెన్సు కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోనున్నట్లు, ఆ తర్వా 7–9 నెలల్లో నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు జేఎస్‌డబ్ల్యూవోపీ సీఈవో గౌరవ్‌ సచ్‌దేవా చెప్పారు. ఇందులో దాదాపు 200 మంది వరకూ సిబ్బంది ఉంటారు. ఆ తర్వాత క్రమంగా గ్రూప్‌లోని సిమెంటు, స్టీల్, పెయింట్స్‌ తదితర ఇతర కంపెనీలకు ఫైనాన్సింగ్‌ సొల్యూషన్స్‌ అందిస్తుంది. తమ క్లయింట్లుగా ఉన్న లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు బ్యాంకింగ్‌ రంగం నుంచి తోడ్పాటు ఎక్కువగా లభించదని, ఈ నేపథ్యంలోనే వాటి అవసరాలను తీర్చేందుకు ఎన్‌బీఎఫ్‌సీని ఏర్పాటు చేస్తున్నట్లు సచ్‌దేవా చెప్పారు. 

మరిన్ని వార్తలు