బంపరాఫర్‌..! ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై రూ. 3 లక్షల ప్రోత్సాహకాలను ప్రకటించిన జేఎస్‌డబ్ల్యూ ..!

27 Dec, 2021 20:49 IST|Sakshi

బంపరాఫర్‌..! ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై ప్రముఖ దేశీయ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ తమ ఉద్యోగుల కోసం సరికొత్త పాలసీను ప్రకటించింది. సంప్రాదాయ వాహనాల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకంపై ఆయా దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం కొత్త పాలసీలతో ముందుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ దిగ్గజ కంపెనీ జేఎస్‌డబ్య్లూ గ్రూప్ గ్రీన్ ఇనిషియేటివ్‌లో భాగంగా తమ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీని ప్రారంభించింది.

3 లక్షలకు వరకు ప్రోత్సాహకాలు..!
2022 జనవరి 1 నుంచి ఈ కొత్త ఈవీ పాలసీ అమల్లోకి రానుంది. తమ ఉద్యోగులను ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది. కొత్త ఈవీ పాలసీతో నాలుగు చక్రాల వాహనాలు, అలాగే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడానికి రూ. 3 లక్షల వరకు జేఎస్‌డబ్ల్యూ ప్రోత్సాహకాలను అందించనుంది. వీటితో పాటుగా ఉద్యోగుల కోసం అన్ని జేఎస్‌డబ్ల్యూ కార్యాలయాలు , ప్లాంట్లల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉచిత ఛార్జింగ్ స్టేషన్లను, గ్రీన్ జోన్‌ పార్కింగ్ స్లాట్లను కూడా ఏర్పాటుచేయనుంది.

ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ... 2070 వరకు కర్భన ఉద్గారాలను సున్నాకు తెచ్చేవిధంగా కాప్‌-26లో భారత్‌ చేసిన వాగ్దానానికి మా కంపెనీ నిబద్ధతతో ఉందని అన్నారు.

చదవండి: 2022లో పెరగనున్న కార్లు, బైక్స్‌ కంపెనీల జాబితా ఇదే..!

మరిన్ని వార్తలు