స్థిరంగా కొనసాగుతున్న పెట్రో ధరలు, 14 రోజులుగా

31 Jul, 2021 11:00 IST|Sakshi

దేశీయ మార్కెట్‌లో చమురు ధరలు 14రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు వారాల క్రితం పెరిగిన చమరు ధరలు ఆ తర్వాత నుంచి ఎలాంటి మార్పుచోటు చేసుకోలేదు.  మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు  ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.05 శాతం పెరుగుదలతో 75.14 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.14 శాతం పెరుగుదలతో 73.72 డాలర్లకు చేరింది.
 
 శనివారం రోజు పెట్రోల్‌ ధరల వివరాలు    

ముంబై లీటర్‌ పెట్రోల్‌ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది
ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది
చెన్నైలో పెట్రోల్‌ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది
కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది
హైదరాబాద్‌ లో పెట్రోల్‌ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది
బెంగళూరు లో పెట్రోల్‌ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది

మరిన్ని వార్తలు